గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఇది రిలీజ్ అయ్యాక చరణ్ రెండు కాంబినేషన్స్ కోసం ఐదేళ్ళ వరకు బిజీ కానున్నాడు. త్వరలోనే తన 16వ సినిమా విషయంలో మరింత స్పీడ్ పెంచనున్నాడు. అలాగే సుక్కు 17వ సినిమా కూడా లైన్ లో ఉంది. బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక షెడ్యూల్ కంప్లీట్ చేశారని సమాచారం.
Ram Charan
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. గ్రాండ్ కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2026 చివరలో లేదా 2027 ప్రథమార్థంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చరణ్ ఈ ప్రాజెక్ట్ కోసం రెండేళ్ల సమయం కేటాయించనున్నారు. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు, గ్లోబల్ స్టార్‌తో సినిమా చేసే అవకాశం పొందడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అయితే, చరణ్ రాబోయే ప్రాజెక్టుల్లో ఆర్సీ 17 మరింత ప్రత్యేకంగా మారనుంది.
రంగస్థలం (Rangasthalam) తర్వాత రామ్ చరణ్, సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో వస్తుండటంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక రంగస్థలం కంటే హై లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట. ఈ కాంబో మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్‌కు మరోసారి న్యాయం చేయబోతుందని మెగా ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. సుకుమార్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమవుతుండగా, బుచ్చి బాబు సినిమా పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ మొదలుకానుంది.
ఆసక్తికర విషయం ఏమిటంటే, సుకుమార్ సినిమా రెండు భాగాలుగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇది రామ్ చరణ్ కెరీర్‌లో మరో కీలక మూవీ అవుతుందని అంటున్నారు. దీంతో రామ్ చరణ్ తన తదుపరి ఐదేళ్లకు 3 ప్రాజెక్ట్‌లను ఫిక్స్ చేసినట్లే. ఈ మూడు ప్రాజెక్ట్‌ల కోసం చరణ్ పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయిస్తుండటంతో, అభిమానులు ఆయన నుంచి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ల కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాలు చరణ్ కెరీర్‌లో ఎలాంటి విజయాలను సాధిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.