Ram Charan Remuneration: హాట్ స్టార్ తో చరణ్ క్రేజ్ పెరగనుందా?

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒకటనే విషయం తెలిసిందే. హాట్ స్టార్ తెలుగు కంటెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టి తాజాగా మాస్ట్రో సినిమాను విడుదల చేసింది. తెలుగులో మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడానికి హాట్ స్టార్ నిర్వాహకులు చరణ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేశారు. స్టార్ హీరో రామ్ చరణ్ హాట్ స్టార్ తెలుగు రీజియన్ కు చెందిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు.

అయితే హాట్ స్టార్ ఎండోర్న్మెంట్ కు చరణ్ కు ఏకంగా 5 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఈ స్థాయిలో ఎండోర్స్మెంట్ల కోసం పారితోషికం తీసుకుంటున్న సెలబ్రిటీలు తక్కువమంది ఉన్నారు. చరణ్ ద్వారా హాట్ స్టార్ కు సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉండగా హాట్ స్టార్ వల్ల చరణ్ కు కూడా క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నారు.

చరణ్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో చరణ్ కలెక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Share.