దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పినా కూడా అందులో ఎదో ఒక పరమార్థం ఉంటుందని నేటితరం వారు లాజికల్ గా ఆలోచిస్తారు. అయితే వర్మ అప్పుడప్పుడు కొంత భజన కూడా చేస్తాడని రుజువవుతూనే ఉంది. పూరి జగన్నాథ్ అంటే అర్జీవికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక లైగర్ పై ఆయన ఇచ్చిన షార్ట్ రివ్యూపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. లైగర్ సీన్స్ చూశాను అంటూ టైగర్, లయన్ కంటే క్రాస్ అని పేర్కొన్నాడు.
అంతే కాకుండా బిగ్ స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవి తేజ, టైగర్ ష్రాఫ్ కంటే కూడా విజయ్ దేవరకొండ సూపర్ క్రాస్ అని అన్నాడు. ఇక మరొక ట్వీట్ లో అయితే స్క్రీన్ ప్రజెన్స్ బావుందని అంటూ ఇలాంటి స్టార్ ను గత రెండు దశబ్దాల్లో నేను చూడలేదని, అలాంటి స్టార్ ను తీసుకువచ్చిన పూరి జగన్నాధ్, ఛార్మిలకు RGV కృతజ్ఞతలు తెలిపాడు. ఇక వర్మ చేసిన కామెంట్స్ పై ఓ వర్గం నెటిజన్లు ట్రోల్స్ మొదలుపెట్టారు.
నువ్వు ట్వీట్ చేశావు అంటేనే అర్ధమవుతోంది అంటూ మెహబూబాకు చెప్పిన మాటలను కూడా గుర్తు చేస్తున్నారు. ఆ సినిమా చూసిన తరువాత మహేష్ పోకిరి కూడా ప్లాప్ మూవీ అంటూ కాస్త ఇంగ్లీష్ బూతులతో బజ్ క్రియేట్ చేశాడు వర్మ. ఇక ఇప్పుడు లైగర్ పై కామెంట్స్ చేయడంలో ఈ సినిమా కూడా ప్లాప్ అని అంటున్నారు. మరి వర్మ మాటలు ఎంతవరకు నిజమవుతాయో చూడకి.