Vijay, Rashmika: విజయ్ దేవరకొండకు ప్రామిస్ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!
- June 28, 2025 / 07:51 PM ISTByFilmy Focus Desk
ఆమె ముట్టుకుంటే సినిమా హిట్టే అనే స్థాయికి రష్మిక మందన (Rashmika Mandanna) స్థాయి పెరిగిపోయింది. అలా ఉంది మరి ఆమె రీసెంట్ సినిమాల ఫలితాలు. రీసెంట్‌గా ‘కుబేర’ (Kuberaa) సినిమాలో చిన్న పాత్రే చేసినా సినిమాకు మంచి బూస్టింగ్ ఇచ్చింది. సినిమా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో హీరోయిన్ ఓరియెంటెడ్ హీరోయిన్ అయిపోయే ఆలోచనలో ఉంది. మరోవైపు ఎప్పటిలా భిన్నమైన కథలకు ప్రాధాన్యమిస్తూ ‘మైసా’ అనే కొత్త సినిమా అనౌన్స్ చేసింది.
Vijay, Rashmika
ఈ పోస్టర్ రిలీజ్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.‘మైసా’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ ద్వారా ఆమె ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. దీంతో రష్మికకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సినీ ప్రముఖులు చాలా మంది పోస్ట్‌లు పెట్టారు. ఈ క్రమంలో ఆమె స్నేహితుడు (?) విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు అభినందనలు చెప్పారు.

ఇప్పుడు ఆ పోస్టుకు ఆమె ఇచ్చిన రిప్లై అందరినీ ఆకర్షిస్తోంది. ‘ఇది అద్భుతంగా ఉండనుంది’ అని విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ‘మైసా’ పోస్టర్‌ను షేర్ చేశాడు. ఆ పోస్టును రీ షేర్ చేసిన రష్మిక.. ‘విజ్జూ.. ఈ సినిమాతో నేను నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా’’ అని రాసుకొచ్చింది రష్మిక (Rashmika Mandanna). దాంతోపాటు హార్ట్ ఎమోజీ కూడా పెట్టింది. విజయ్ దేవరకొండను రష్మిక అలా విజ్జూ అని పిలవడంతో మరోసారి ఈ జంట హాట్ టాపిక్‌గా మారింది.

గత కొన్ని ఏళ్లుగా ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. వాళ్లు కూడా ఏదో ఒకలా తమ రిలేషన్ లీకులు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్, రిప్లయ్‌తో విజయ్, రష్మిక (Rashmika Mandanna)ఫ్యాన్స్ హ్యాపీ. అయితే, అందరికీ ఒకటే డౌట్. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారు అని ఇలా లీక్‌లు ఇవ్వకుండా.. నేరుగా అసలు విషయం చెప్పేయొచ్చు కదా అని. మరి ఈ ఆలోచనను ఎప్పుడు పట్టించుకుంటారో ఏమో.














