మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సినిమా హిట్టైనా ఫ్లాపైనా రవితేజకు క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రవితేజ గత సినిమాలు టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) , ఈగల్ (Eagle) బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోయినా యాక్షన్ ప్రియులకు మాత్రం ఈ సినిమాలు ఎంతగానో నచ్చేశాయి. భగవంత్ కేసరి (Bhagavath Kesari) , లియో (LEO) సినిమాలతో పోటీ పడటం టైగర్ నాగేశ్వరరావు సినిమాకు మైనస్ అయింది.
కథ, స్క్రీన్ ప్లే విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే టైగర్ నాగేశ్వరావు రవితేజ కెరీర్ లోని బెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే టైగర్ నాగేశ్వరరావు మూవీ ఫ్లాపైనా రవితేజ ఖాతాలో అదిరిపోయే రికార్డ్ చేరింది. యూట్యూబ్ లో టైగర్ నాగేశ్వరరావు హిందీ వెర్షన్ క్రియేట్ చేసిన రికార్డ్ మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
యూట్యూబ్ లో ఈ సినిమా హిందీ వెర్షన్ కు 100 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. టైగర్ నాగేశ్వరరావు హిందీ వెర్షన్ కు 10 లక్షల లైక్స్ వచ్చాయి. రెండు నెలల క్రితం యూట్యూబ్ లో ఈ సినిమా విడుదలైంది. ఆర్కేడీ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ లో ఈ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కావడం గమనార్హం. రవితేజ మూవీ సాధించిన రికార్డ్ విషయంలో చిత్ర నిర్మాణ సంస్థ ఆనందం వ్యక్తం చేసింది.
రవితేజకు సీరియస్ సినిమాల కంటే ధమాకా (Dhamaka) తరహా సినిమాలే సూట్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న అతికొద్ది మంది హీరోలలో రవితేజ ఒకరు. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) అనే ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మిరపకాయ్ (Mirapakay) తర్వాత రవితేజ హరీష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.