సినిమాకు సంబంధించి రూల్స్ ఏమీ ఉండవు. ఎవరు ఎలా అయినా సినిమా తీయొచ్చు, ఎవరు ఎలా అయిన పోస్టర్‌లు సిద్ధం చేయొచ్చు, ఎవరు ఎలా అయినా టీజర్‌లు, ట్రైలర్‌లు కట్ చేయొచ్చు. ఏంటీ ఈ విషయంలో మీకేమైనా డౌట్ ఉందా? కచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఒక్కో డైరక్టర్‌కి ఒక్కో స్టైల్ ఉంటుంది. అందుకే ఒక్కో ప్రచార చిత్రం ఒక్కోలా ఉంటుంది. అయితే కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraj) స్టైల్ వీరందరికీ మించి అని చెప్పాలి.
ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు కొత్తగానే ఉన్నాయి. ఫలితాల సంగతి పక్కన పెడితే ఆయన మార్క్ కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి కార్తిక్ సుబ్బరాజు ఇప్పుడు సూర్యతో(Suriya) ‘రెట్రో’ (Retro) అనే సినిమా చేశారు. పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటి కథతో కాదు, పాత స్టైల్‌లో ఉన్న కథతో అని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను మే1న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను టీమ్ రిలీజ్ చేసింది.
అందులో కార్తిక్ సుబ్బరాజు తన మార్క్‌ను పక్కాగా చూపించారు. కార్తీక్ సుబ్బరాజు సినిమాలు అంటేనే చిత్రంగా ఉంటాయని తెలిసినవాళ్లకు ‘రెట్రో’ ట్రైలర్ ఆశ్చర్యకరంగా అనిపించకపోవచ్చు. కొత్త వాళ్లకు అయితే కచ్చితంగా ఉంటుంది. ‘రెట్రో’ సినిమా ట్రైలర్ నార్మల్ ట్రైలర్‌లా లేదు. సినిమాలోకి కొన్ని ముఖ్యమైన సీన్ల మాష్‌అప్ ఈడియోలా ఉంది. సినిమాలోని పాత్రలు, వాటి వైవిధ్య ఆలోచనలు తెలిపే సన్నివేశాలను ఆ ట్రైలర్‌లో చూడొచ్చు.
ప్రముఖ నటుల హావభావాలను ముక్కలు ముక్కలుగా కట్ చేసి మళ్లీ పక్కనపక్కన పేర్చినట్లు ట్రైలర్‌ను సిద్ధం చేశారు. సూర్య గెటప్ బాగుంది, పూజ హెగ్డేకు పెద్ద ప్రాముఖ్యత లేదు. అయితే జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్, నాజర్ పాత్రలకు ప్రాధాన్యం ఉంది అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అంత పెద్ద ట్రైలర్ రిలీజ్ చేసినా.. పాత్రల సంగతేంటో, కథ లైన్ ఏంటో, ఏమవుతుంది అనే విషయాలు ఎక్కడా అర్థం కావడం లేదు. ఓ ఓ క్రేజీ, మ్యాడ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. మరి సినిమా ఎలా ఉంటుందో?