యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ హీరో హీరోయిన్లుగా రాబోతున్న ‘సాహో’ చిత్రం మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుంది. 350 కోట్ల భారీ బడ్జెట్ తో ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్,విక్రమ్ లు కలిసి నిర్మించారు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రాన్ని రేంజ్లో తెరకెక్కించాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం, టీజర్, ట్రైలర్లకు అద్భుతమైన స్పందన లభించింది. ఇక తాజాగా ‘యూట్యూబ్’ లో ఫుల్ ఆడియో జ్యూక్ బాక్స్ ను విడుదల చేసారు. ఈ చిత్రంలో ఒక్కొక్క పాటని ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేశాడు. అయితే అవి ఎవరెవరు కంపోజ్ చేశారు… ఎలా ఉన్నాయి అనేది ఓ లుక్కేద్దాం రండి.
1) ‘సైకో సయ్యాన్’ అంటూ సాగే ఈ పాట మొదటి నుండీ సినిమా పై హైప్ క్రియేట్ చేస్తూనే ఉంది. మొదటగా ఈ పాటని విడుదల చేసినప్పుడు తెలుగు లిరిక్స్ తక్కువగా ఉన్నాయనే కంప్లైంట్ వచ్చింది. కానీ బీట్.. బంగుండడం, పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా ఉండడంతో స్లో గా ఎక్కేసింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ లు ఈ పాటకి మరింత అందాన్ని తెచ్చినట్టు ప్రోమో చూస్తే స్పష్టమవుతుంది. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ తనిష్క్ బాగ్చి ఈ పాటను బాణీలు సమకూర్చాడు. ధన్వి భనుశాలి ఈ పాటను పాడగా… తనిష్క్ బాగ్చి, శ్రీజో కలిసి ఈ పాటను రాసారు.
2) ‘ఏ చోట నువ్వున్నా’ అంటూ సాగే ఈ పాటకి మంచి స్పందన వచ్చింది. గురు రాంధ్వా మ్యూజిక్ అందించిన ఈ పాటకి…. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్ కలిసి ఈ పాటను పాడారు. ప్రభాస్ అభిమానులతో పాటు లవర్స్ కి కూడా ఈ పాట నచ్చిందనే చెప్పాలి. సినిమాలో ఈ పాట మరింత అందంగా కనిపించబోతుందని ప్రోమో చూస్తూనే స్పష్టమవుతుంది.
3) ‘బ్యాడ్ బాయ్’ అంటూ సాగే ఈ పాట లో ప్రభాస్ తో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రొమాన్స్ చేసింది. ‘మేబీ ఐ యామ్ ఎ బ్యాడ్ బాయ్ కన్ యు బి మై బ్యాక్ బోన్ హాయ్ బేబీ సో’.. అంటూ తెలుగు, ఇంగ్లీష్ కలగలిపి ఉన్న ఈ పాట లిరిక్స్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కచ్చితంగా ఈ ఆల్బం లో ఎక్కువ ఆదరణ దక్కించుకున్న పాట ఇదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాద్షా సంగీతం అందించాడు.నీతి మోహన్ అలాగే బాద్షా కలిసి ఈ పాటని పాడారు.
4) ‘బేబీ వోంట్ యు టెల్ మి’ అంటూ సాగే ఈ నాలుగో పాటకి ‘శంకర్ ఎహసాన్ లాయ్’ సంగీతమందించారు. ప్రభాస్, శ్రద్దా కపూర్ మధ్య వచ్చే మెలోడీ సాంగ్ గా ఈ చిత్రంలో ఉండబోతుందని తెలుస్తుంది. శ్వేతా మోహన్, సిద్ధార్థ్ మహదేవన్, శంకర్ మహదేవన్ కలిసి ఈ పాటని పాడారు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు. ‘ఉదయం, సాయంత్రం ఈ కాఫీ తీసుకునే సమయంలో ఈ పాటని వింటే మూడ్ బెటర్ అవుతుందని’ సొషల్ మీడియాలో కొందరు మ్యూజిక్ లవర్స్ ఈ పాట పై ఈ కామెంట్ చేశారు.
ఓవరాల్గా ‘సాహో’ ఆల్బం మనం ఎప్పుడూ వినే రొటీన్ తెలుగు పాటల్లా కాకుండా భిన్నంగా ఉన్నాయి.విన్న వెంటనే ఆకట్టుకోలేకపోయినా మెల్లగా ‘చాప కింద నీరులా’ మన మైండ్లోకి చేరుకునేలా ఉన్నాయి. 70 ఎం.ఎం స్క్రీన్ పై ఈ పాటలు కచ్చితంగా ఆకట్టుకుంటాయని బెల్లంగా చెప్పొచ్చు.