యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. ‘రన్ రాజా రన్’ ఫేమ్ ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని ఏకంగా 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ‘బాహుబలి’ పేరు చెప్పి ఇంత బడ్జెట్ పెడితే ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుందా… నిర్మాతలకి కనీసం పెట్టిన పెట్టుబడి తిరిగొస్తుందా అని చాలా మంది ప్రశ్నించారు. అయితే అందరికీ దిమ్మతిరిగేలా ‘సాహో’ చిత్రానికి ఏకంగా 500 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. ఇందులో థియేట్రికల్ రైట్స్ 290 కోట్లు బిజినెస్ జరిగింది.
ఇక ‘సాహో’ వరల్డ్ వైడ్ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
‘సాహో’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 290 కోట్లు జరిగింది. అంటే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వాలంటే 290 కోట్లు పైనే షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ మొత్తం కలిపి 500 కోట్లు నిర్మాతలకి వచ్చాయి. ఇక ఈ సినిమాకి 350 కోట్లు బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. అంటే నిర్మాతలకి 150 కోట్ల పైనే లాభాలు వచ్చాయన్న మాట. ఇక సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డు కలెక్షన్లు రావడం ఖాయమనే చెప్పాలి.