పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా మరికొన్ని గంటల్లో .. అంటే డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. టికెట్ల కోసం ఇప్పటికే పడిగాపులు కాస్తున్నారు అభిమానులు. ఇప్పటివరకు కొన్ని చోట్ల మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇంకా చాలా చోట్ల ఓపెన్ అవ్వాల్సి ఉంది.రిలీజ్ టైం దగ్గరపడేకొద్దీ ప్రభాస్ అభిమానుల్లో టెన్షన్ పెరుగుతుంది అనే చెప్పాలి. ఎందుకంటే ‘బాహుబలి 2 ‘ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ ‘రాధేశ్యామ్’ ‘ఆదిపురుష్’… బాగా నిరాశపరిచాయి.
అందులో ప్రభాస్ మార్క్ ఎలివేషన్స్ కూడా బాగా మిస్ అయ్యాయి. సో ‘కె.జి.ఎఫ్'(సిరీస్) లాంటి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ ‘సాలార్’ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగంగా ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో రేపు రిలీజ్ కాబోతుంది.
ఇదిలా ఉండగా … (Salaar) ‘సలార్’ సినిమా ‘ఉగ్రం’ కి రీమేక్ అనే చర్చ కూడా ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. దాని సంగతి ఎలా ఉన్నా.. ‘సలార్’ సినిమా ‘కె.జి.ఎఫ్’ రేంజ్లో ఉంటుందా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇదే విషయాన్ని చిత్ర బృందాన్ని డైరెక్ట్ గా అడిగితే.. ” ‘కె.జి.ఎఫ్’ రేంజ్ సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని ‘సలార్’ థియేటర్లకు రాకూడదు.
అందులో యాక్షన్ బాగా పండింది. డ్రామా తక్కువగా ఉంటుంది. కానీ ‘సలార్’ లో డ్రామా కొంచెం ఎక్కువగా పెట్టడం జరిగింది. కచ్చితంగా ఇది అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది’ అంటూ చెప్పుకొచ్చారు. సో అది,భారీగా ఆశించకుండా వెళ్తే ‘సలార్’ డిజప్పాయింట్ చేయదన్న మాట.