‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ పై నవీన్ ఎర్నేని (Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar)..లు సంయుక్తంగా నిర్మించారు. మొదటి షోతోనే ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ చెబుతున్నారు. టికెట్ రేట్లు భారీగా పెరిగినా వాటిని లెక్కచేయకుండా.. జనాలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 3 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి.
Sukumar
మొదటి రోజు ఈ సినిమా కచ్చితంగా రూ.300 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అని ట్రేడ్ పండితుల అంచనా. ఇదిలా ఉండగా.. ‘పుష్ప 2’ చూసిన వారిలో ఎక్కువ శాతం ‘సుకుమార్ పై సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రభావం పడిందా?’ అంటూ అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ‘పుష్ప 2’ లో కొన్ని సన్నివేశాలు గతేడాది రిలీజ్ అయిన ‘యానిమల్’ ని (Animal) పోలి ఉంటాయి. ఆ సినిమాలో హీరో చాలా మూర్ఖుడిలా ఉంటాడు.
కానీ అతనికి చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. పక్కన ఉన్నవారు ఏం చెప్పినా వినడు. సరిగ్గా ‘పుష్ప 2’ లో అల్లు అర్జున్ (Allu Arjun) పాత్ర కూడా అలానే ఉంటుంది. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్ విషయంలో..! ‘యానిమల్’ సినిమాలో హీరో- హీరోయిన్ల మధ్య ఇంటిమేట్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ‘పుష్ప 2’ లో కూడా అలాంటి సీన్స్ ఉన్నాయి. వంట గదిలో కూడా మొగుడు, పెళ్ళా..లు ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోవడం వంటివి చాలా ‘రా’గా అనిపిస్తాయి.
ఇవన్నీ సందీప్ స్టైల్లోనే ఉంటాయి. గతంలో సుకుమార్ ఇలాంటి సీన్లు పెట్టింది లేదు. అయితే ఓ సీన్ చాలా ఇంప్రెస్ కూడా చేస్తుంది. అదేంటంటే.. ‘కడుపుతో ఉన్న భార్యను.. భర్త ఎత్తుకుని బాత్రూంలోకి తీసుకెళ్లి వెస్ట్రన్ టాయిలెట్ పై కూర్చోబెట్టడం’ అనేది ఇంప్రెసివ్ గా, నేచురల్ గా అనిపిస్తుంది. సుకుమార్ ఈ విషయంలో కూడా సందీప్ ..నే ఫాలో అయ్యాడేమో అనిపిస్తుంది.