విక్టరీ వెంకటేష్(Venkatesh Daggubati), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఆల్రెడీ ‘రంగస్థలం’ ‘వాల్తేరు వీరయ్య’ వంటి సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ ని దాటేసింది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 12 రోజుల్లో రూ.126.5 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.85.5 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయింది. ఆదివారం రోజున కూడా ఈ సినిమా కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది.