విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) , దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో ‘ఎఫ్ 2’ (F2 Movie) ‘ఎఫ్ 3’ (F3 Movie)..ల తర్వాత హ్యాట్రిక్ మూవీగా వచ్చింది ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. పండుగ ముగిశాక కూడా ఈ సినిమా కలెక్షన్స్ జోరు తగ్గడం లేదు.నిన్న కూడా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది. ఆల్రెడీ ‘రంగస్థలం’ (Rangasthalam) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) వంటి సినిమాల రికార్డులు బ్రేక్ చేసిన ఈ సినిమా..
Sankranthiki Vasthunam Collections:
ఈ వారం కూడా ఇదే జోరు చూపిస్తే ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) కలెక్షన్స్ కూడా బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకసారి (Sankranthiki Vasthunam) 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 13 రోజుల్లో రూ.134.05 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.93.05 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయింది. నిన్న 13వ రోజు అయినప్పటికీ ఆదివారం అడ్వాంటేజ్ తో ఈ సినిమా రూ.7 కోట్లకి పైగా షేర్ ను కలెక్ట్ చేసి ఇండస్ట్రి రికార్డు కొట్టింది.