విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ ‘ఎఫ్ 3’ వంటి హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటి తర్వాత హ్యాట్రిక్ మూవీగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) రూపొందింది. దీనికి కూడా దిల్ రాజే నిర్మాత. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి..లు హీరోయిన్లు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, ట్రైలర్ వంటి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రమణ గోగుల పాడిన ‘గోదారి గట్టు’ అనే సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
యూట్యూబ్ లో ఈ లిరికల్ సాంగ్ కి వంద మిలియన్ల వ్యూస్ వచ్చాయి. సో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) ప్రమోషనల్ కంటెంట్ కి మంచి మార్కులు పడ్డాయి. అందువల్ల 2025 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా ఇదే అని అంతా ఫిక్స్ అయ్యారు. ఇలాంటి హైప్ మధ్య ఈ సినిమా విడుదల కాబోతుంది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు.. టాలీవుడ్ కి చెందిన కొంతమంది పెద్దలకి చూపించడం జరిగింది. సినిమా చూశాక.. వాళ్ళు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.వారి టాక్ ప్రకారం.. ‘ఓ పెద్ద పొలిటీషియన్ కిడ్నాప్ అవుతాడు.
దీంతో పోలీసులు హెల్ప్ లెస్ అవుతారు. అలాంటి టైంలో మీనాక్షి(మీనాక్షి చౌదరి)..తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కమ్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి వై.డి.రాజు (వెంకటేష్) (Venkatesh) సాయం కోరుతుంది. అయితే వీరు గతంలో లవర్స్ అనే విషయం తెలుసుకున్న భాగ్యలక్ష్మి(ఐశ్వర్య రాజేష్).. తాను కూడా అండర్ కవర్ ఆపరేషన్లో భాగం అవుతానని చెప్పి రాజు వెంట వెళ్తుంది. సంక్రాంతికి తిరిగి వచ్చేస్తాం అని రాజు తన బంధుమిత్రులకు చెప్పి ఈ అండర్ కవర్ ఆపరేషన్ కోసం వెళ్తాడు.
ఆ తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులే.. మిగిలిన కథ అని తెలుస్తుంది. సినిమాలో కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందట. కొన్ని మాస్ ఎలిమెంట్స్ వెంకీ అభిమానులని ఆకట్టుకుంటాయని అంటున్నారు. 2 గంటల 24 నిమిషాల పాటు ఎంగేజ్ చేసే ఫ్యామిలీ డ్రామా ఇది అని తెలుస్తుంది.