Siddu Jonnalagadda: రెండు పార్టుల స్టైల్‌లోకి వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ… అమ్మవారి కన్ను..!
- October 12, 2024 / 10:03 PM ISTByFilmy Focus
సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కొత్త సినిమా పోస్టర్‌ను టీమ్ లాంఛ్ చేసింది. దీని వల్ల ఆ హీరో విషయంలో ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అవ్వగా.. మరో రెండు సినిమాలకు సంబంధించి డౌట్స్ మొదలయ్యాయి. ఆ సినిమాల్లో ఒకటి రవితేజ (Ravi Teja) ది కాగా, మరొకటి పవన్ కల్యాణ్‌ది. సినిమా టైటిల్ రవితేజ ఫ్యాన్స్‌ను డౌట్‌లో పడేయగా.. సినిమా నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్‌కి డౌట్స్ క్రియేట్ చేసేలా ఉంది. దీంతో ఇప్పుడు చర్చ అంతా దీని గురించే.
Siddu Jonnalagadda

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, రవికాంత్ పేరేపు దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేశాయి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సంస్థలు. సినిమాకు ‘కోహినూర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఆ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో కత్తి, మరో చేతిలో వజ్రంతో సిద్ధు ఆ పోస్టర్‌లో అదిరే పోజు ఇచ్చాడు. ‘ది కింగ్ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్’ అనే ఉపశీర్షికతో కాన్సెప్ట్ కూడా చెప్పేశారు.

2026 సంక్రాంతికి సినిమాను తీసుకొస్తామని టీమ్ అనౌన్స్ చేసి కర్చీఫ్ వేసేసింది. అయితే ఇదే సితార బ్యానర్‌ఓ భాను భోగవరపు అనే కొత్త దర్శకుడితో రవితేజ చేస్తున్న సినిమాకు ఈ టైటిల్ పెడతారు అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ టైటిల్ మాది కాదా? అంటూ ఫ్యాన్స్ క్వశ్చన్ మార్కు ఫేస్ పెట్టారు. ఇక పవన్ (Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కూడా కోహినూర్ వజ్రం నేపథ్యంలోనే అనే విషయం తెలిసిందే.

దీంతో పవన్ సినిమా నేపథ్యంలోనే సిద్ధు సినిమానా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే రెండు కాలాలు డిఫరెంట్ కాబట్టి కాన్సెప్ట్ డిఫరెంట్. ఇక సితార బ్యానర్‌లోనే రవితేజ సినిమా ఉండటం.. సిద్ధుతో సినిమా ఉందనే విషయం బయటకు రాకపోవడం లాంటి విషయాల వల్ల ‘కోహినూర్’ టైటిల్ లీక్ అవ్వడంతో అది రవితేజ కోసం అనుకున్నారేమో అనే మాట కూడా వినిపిస్తోంది. అన్నట్లు ఈ సినిమా రెండు పార్టుల్లో తెరకెక్కిస్తున్నారట. ఇప్పుడు వచ్చిన పోస్టర్ ‘కోహినూర్ 1’.















