రెండు వారాలుగా దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఎస్పీ బాలు ఆరోగ్యంపై విచారం వ్యకం చేస్తున్నారు. ఆయన కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. లెజెండరీ సింగర్ బాల సుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. కొద్దిరోజుల క్రితం తనకు కరోనా సోకిందని, మైల్డ్ సింటమ్స్ ఉన్నాయని, తనకు ఏమీ కాదని తొందరలో కోలుకొని తిరిగి వస్తానని బాలు ఓ వీడియో సందేశం పంచుకోవడం జరిగింది. దీనితో బాలుగారికి ఏమీ కాదని అందరూ భావించారు.
ఐతే చికిత్స మొదలైన వారం రోజుల తరువాత ఆరోగ్యం విషమించింది. ఎస్పీ బాలు చికిత్స కోసం చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చేరగా, ఆయనను ఐ సి యూకి తరలించడంతో పాటు, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. బాలు ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ప్రతి రోజు అప్డేట్ ఇస్తున్నారు. మూడు రోజులుగా ఎస్పీ బాలు ఆరోగ్యం కొంచెం కూడా మెరుగుపడలేదని ఆయన చెప్పడం జరిగింది.
నేడు కూడా బాలు ఆరోగ్యంపై ఓ వీడియో విడుదల చేయడంతో పాటు, నాన్నగారు తిరిగి వస్తారని నమ్మకం ఉందన్నారు. దీనితో బాలు ఆరోగ్యంపై ఆయన అభిమానులు మరింత ఆందోళన చెందుతున్నారు. చరణ్ స్వరంలో ఆవేదన కనిపించడం అందరినీ కలవరపెడుతుంది.
View this post on Instagram
A big thank you for the mass prayers.
A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on