‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రమోషనల్ యాక్టివిటీస్ దాదాపు కంప్లీట్ అయ్యాయి. అయితే ఇందులో భాగంగా రిలీజ్ చేసిన ‘అదిదా సర్ప్రైజ్’ సాంగ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కూడా అందరూ గమనించే ఉంటారు. ఈ సినిమాలో ఎన్ని పాటలు రిలీజ్ అయినా ఆడియన్స్ కి ఈ ఒక్క పాటే గుర్తుంది. కారణం అందులో హీరోయిన్ చేసిన హుక్ స్టెప్. కానీ ఇది శృతిమించింది అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మహిళా కమిషన్ కూడా ‘ఇది అశ్లీలతను ప్రేరేపించే విధంగా ఉంది’ అంటూ వ్యతిరేకించింది. సినిమాలో ఈ స్టెప్స్ ఉంటాయో లేదో అనే సందిగ్ధంలో అందరూ ఉండగా.. ఇప్పుడు శ్రీలీల (Sreeleela) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వివాదంపై శ్రీలీల (Sreeleela) మాట్లాడుతూ.. “నేను కూడా ఐటెం సాంగ్ చేశాను. మీకు కూడా తెలుసు. వాటికి డాన్స్ చేసే హీరోయిన్స్ కంఫర్ట్ అనేది చాలా ముఖ్యం. అలా అయితేనే వాళ్ళు చేయగలరు. అమ్మాయి కంఫర్ట్ గా ఫీలయితే ఇక ఇబ్బంది ఏమీ ఉండదు.
అది పూర్తిగా ఆ అమ్మాయి ఫ్రీడమ్ కి సంబంధించింది అవుతుంది. వేరే వాళ్ళు ఏమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మహిళా కమిషన్ చర్యలపై నేను ఏమీ మాట్లాడలేను. ఎందుకంటే అదొక మంచి సంస్థ. స్త్రీలకు చాలా అవసరమైన సంస్థ. వారి విధి విధానాలు చొప్పున వాళ్ళు నడుచుకోవడం చాలా ముఖ్యం. సమాజానికి ఏది మంచి.. ఏది చెడు అనేది వారికి తెలుసు. అయితే నేను ఒక నటిగా.. సాంగ్లో చేసిన నటి కంఫర్ట్ గురించి మాత్రమే నేను మాట్లాడగలను. అలాంటి సాంగ్స్ నేను చేయాల్సి వచ్చినా.. నేను కంఫర్ట్ గా ఫీలైతేనే చేయగలను” అంటూ చెప్పుకొచ్చింది.