యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. బాహుబలి తర్వాత చేస్తున్న మూవీ, అందులో భారీ యాక్షన్ సీన్స్ ఉంటుందని టీజర్ లో చెప్పడంతో అంచనాలు భారీగా పెరిగాయి. టీజర్ చూసిన వారందరూ ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ అని అనుకున్నారు. అందువల్ల అంచనా తలకిందులు అవుతుందని భావించిన ప్రభాస్ కథపై నోరు విప్పారు. “సాహో సైన్స్ ఫిక్షన్ మూవీ కాదు. సాహో ఫుల్ యాక్షన్ మూవీ. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి” అని స్పష్టం చేశారు. ఈ మాటలను ప్రస్తుతం కొత్త సందేహాలకు బలాన్ని ఇస్తాయి. ఆ సందేహం ఏమిటంటే .. రామోజీ ఫిలిం సిటీలో సాహో కోసం భారీ సెట్ వేస్తున్నారు. 5 కోట్లతో నిర్మితమవుతున్న ఈ సెట్ లో బ్రిటిష్ వారి జెండా ఎగురుతోంది.
పైగా గుర్రాలను, పోలో గేమ్ కోర్ట్ ని ఏర్పాటు చేస్తున్నట్లు వార్త బయటికి వచ్చింది. సో సాహో కథ స్వాతంత్య్రానికి పూర్వం నుంచి మొదలవుతుందనే సందేహం మొదలయింది. ఆనాటి కాలం, ఈనాటి కాలం మిళితమయి ఉంటుందనే ప్రచారం జోరందుకుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. ఏకకాలంలో మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ,ప్రమోద్ లు 225 కోట్లతో నిర్మిస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పనిచేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.