ఒక హీరో కోసం అనుకున్న కథ ఇంకో హీరోకి వెళ్లడం కొత్త విషయం ఏమీ కాదు. కానీ హీరో ఇమేజ్..లను బట్టి కూడా కథలు వేరే వాళ్లకు వెళ్లిపోతాయి అని సందీప్ కిషన్ ను బట్టి చెప్పొచ్చు. విషయం ఏంటంటే అతనికి నచ్చి.. ఓకే అనుకున్న కథలు.. పైగా సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనుకున్న కథలు ఇంకో హీరోల వద్దకి వెళ్లిపోయాయి. ‘మజాకా’ టీజర్ లాంచ్ లో సందీప్, రైటర్ ప్రసన్న కుమార్..లు ఈ విషయాల్ని బయటపెట్టారు.
Sundeep Kishan
సందీప్ కిషన్ (Sundeep Kishan) మాట్లాడుతూ.. “సినిమా చూపిస్తా మావ’ అనే సినిమా చూశాను. అప్పుడు రైటర్ ప్రసన్న కుమార్ (Prasanna Kumar Bezawada)..ని పిలిచి నాకు ఈ మీటర్లో ఒక సినిమా చేసి పెట్టు అన్నాను. అప్పుడు ‘నేను లోకల్’ (Nenu Local) అనుకున్నాం. కానీ అది వారే హీరోకి వెళ్ళిపోయింది. ఆ సంగతి నాకు బయట వాళ్ళు చెబితే తెలిసింది. తర్వాత ‘హలో గురు ప్రేమ కోసమే’ (Hello Guru Prema Kosame) అనుకున్నాం. 15 రోజుల్లో షూటింగ్ అనగా.. అది కూడా వేరే హీరోకి వెళ్ళిపోయింది. ఫైనల్ గా ‘మజాకా’ కి కుదిరింది” అంటూ అసలు విషయాన్ని రివీల్ చేశాడు సందీప్ కిషన్.
అటు తర్వాత రైటర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ” ‘నేను లోకల్’ కథ 15 నిమిషాలు చెప్పగానే ‘చాలు ఇది మనం చేసేద్దాం’ అన్నారు సందీప్. కానీ అనుకోకుండా అది వేరే హీరోకి వెళ్ళిపోయింది. తర్వాత ‘హలో గురు ప్రేమ కోసమే’ చేద్దామనుకున్నాం. సరిగ్గా వారం రోజుల్లో షూటింగ్ అనగా అది కూడా వేరే హీరోకి వెళ్ళిపోయింది. అయినా సరే సందీప్ నన్ను పిలిచి ఒక్క మాట కూడా అనలేదు.
ఆయన కోరికతో నిజాయితీ ఉంది కాబట్టి.. మేము ‘ధమాకా’ (Dhamaka) అనే వంద కోట్ల సినిమా చేశాక ఆయనకు ‘మజాకా’ చేసి పెడుతున్నాం అని నేను భావిస్తున్నాను.” అంటూ చెప్పుకొచ్చాడు. సో వీళ్ళ మాటల్ని బట్టి చూస్తే.. దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao) లేదంటే నిర్మాత దిల్ రాజు (Dil Raju).. ఆ కథలకు సందీప్ ఇమేజ్ సూట్ అవ్వదు అని భావించి వాటిని నాని, రామ్..లతో తీసినట్టు ఉన్నారు.