‘బాహుబలి ది బిగినింగ్’ ‘బాహుబలి2’ వంటి చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో రూపొంది సక్సెస్ అందుకున్నాయి. ఆ తరువాత ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ చిత్రం కూడా సూపర్ హిట్ సాధించి సౌత్ సినిమా స్థాయిని పెంచిందనే చెప్పాలి. దీంతో ఆ తరువాత కూడా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి… త్వరలో రాబోతున్నాయి కూడా. అయితే అలా రూపొందే అన్ని సినిమాల్లోనూ పాన్ ఇండియా అప్పీల్ ఉంటుందా… అవి ఆకట్టుకుంటాయా అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. మన తెలుగులో చూసుకుంటే ‘సైరా’ చిత్రం వర్కౌట్ అవ్వలేదు. విజయ్ దేవరకొండ కూడా ‘డియర్ కామ్రేడ్’ తో ట్రై చేసాడు కానీ వర్కౌట్ కాలేదు.. ఇప్పుడు పూరి జగన్నాథ్ తో మరోసారి .. ఆ అటెంప్ట్ చేస్తున్నాడు.
అయితే ఇప్పుడు రూపొందే.. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’, యష్ -ప్రశాంత్ నీల్ ల ‘కె.జి.ఎఫ్2’ చిత్రాలకి పాన్ ఇండియా అప్పీల్ ఉంది. సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఈ చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ -క్రిష్ కాంబోలో రూపొందే చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతుంది. అయితే పవన్ ను బట్టి చూస్తే అది కష్టమే అని చెప్పాలి. కానీ క్రిష్ కు నార్త్ లో కొంత మార్కెట్ ఉంది. ఇక కమల్ -శంకర్ ల ‘ఇండియన్ 2’ చిత్రానికి కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉందనే చెప్పాలి. ఇద్దరికీ నార్త్ లో మంచి మార్కెట్ ఉంది.
ఇక్ అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో ఉంటుందని చాలా మంది చెబుతున్నారు. బన్నీకి కేరళ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ నార్త్ లో ఉందా అంటే… యూట్యూబ్ లో హిందీ డబ్బింగ్ సినిమాలకి 100 మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి అలాగే బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా బన్నీ డ్యాన్స్ గురించి చెబుతుంటారు కాబట్టి… వర్కౌట్ అయ్యే ఛాన్స్ లు అయితే ఉన్నాయి. మరి డైరెక్టర్ టేకింగ్ బట్టి .. మిగిలిన విషయాలు ఆధారపడి ఉంటాయి. ఇక ప్రభాస్ గురించి అయితే ఏమాత్రం సందేహ పడాల్సిన అవసరం లేదు. ‘సాహో’ చిత్రమే ప్రూవ్ చేసింది. అయితే తమిళ్, మలయాళం లో మాత్రం ప్రభాస్ అంత స్ట్రాంగ్ గా లేడని తెలుస్తుంది. నార్త్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మరి ‘ప్రభాస్ 20’ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.