కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ స్టార్ హీరోలు భారతదేశానికి మాత్రమే సుపరిచితులు కాగా రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, శంకర్ లాంటి టాలెంటెడ్ దర్శకులు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ఓటీటీల వల్ల ప్రపంచ దేశాల ప్రేక్షకులకు కూడా టాలీవుడ్ స్టార్ హీరోలు సుపరిచితులు అయ్యారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీలకు ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉంది. మహేష్, పవన్ లకు తర్వాత సినిమాలతో ఈ గుర్తింపు దక్కనుంది. అయితే ఇంటర్నేషనల్ ఇమేజ్ వచ్చిన ఈ స్టార్ హీరోలు నిదానంగా సినిమాలు చేస్తున్నారు.
ఒకప్పుడు ఆరు నెలల్లో సినిమాలు చేసిన టాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు రెండున్నర సంవత్సరాలకు కూడా ఒక సినిమాను పూర్తి చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. విజువల్ ఎఫెక్స్ట్, లొకేషన్స్, ఇతర కారణాల వల్ల సినిమాలు ఆలస్యమవుతున్నాయి. ఒక సినిమా పూర్తైన తర్వాత మరో సినిమా మొదలుపెట్టడానికి కొంతమంది హీరోలు సమయం తీసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ఇమేజ్ టాలీవుడ్ స్టార్స్ కు వరమా? శాపమా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఒకే సమయంలో ఎక్కువ సినిమాలలో నటించడం మాత్రమే ఈ సమస్యకు పరిష్కారంగా ఉంది. ప్రభాస్ (Prabhas) ఒకింత వేగంగా సినిమాల్లో నటిస్తున్నా మిగతా హీరోలు కూడా వేగం పెంచాల్సి ఉంది. 2023 సంవత్సరంలో చాలామంది టాలీవుడ్ స్టార్స్ సినిమాలు విడుదల కాలేదు. అయితే మారుతున్న, అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీలను వినియోగించుకుని ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించి షూటింగ్ లు చేయడం కష్టమేం కాదు.
టాలీవుడ్ స్టార్స్, దర్శకనిర్మాతలు ఈ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది. టాలీవుడ్ సినిమాల బడ్జెట్లు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దర్శకనిర్మాతలు సైతం సినిమాల విషయంలో ఎంతో కేర్ తీసుకోవాల్సి ఉంది. ఈ ఏడాది విడుదల కానున్న కొన్ని క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయాలు సాధిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.