బాహుబలి1 (Baahubali) సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడానికి కారణం క్లైమాక్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అంటూ ప్రముఖ రాజకీయ నాయకులు తమ ప్రసంగాల్లో చెప్పారంటే ఈ డైలాగ్ ఏ రేంజ్ లో మెప్పించిందో సులువుగా అర్థమవుతుంది. అయితే దేవర (Devara) సినిమాలో సైతం దేవర పాత్ర చనిపోతుందని క్లైమాక్స్ ను అలా ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. వర చేతిలోనే దేవర పాత్ర చనిపోతుందని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం కొసమెరుపు.
Baahubali,Devara
అయితే దేవర క్లైమాక్స్ ను అలా ముగిస్తే ఫ్యాన్స్ కు నచ్చుతుందా అనే చర్చ సైతం జరుగుతోంది. వర పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే దేవర గురించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా బెనిఫిట్ షోలు సింగిల్ స్క్రీన్స్ లో ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. నిర్మాతలకు మల్టీప్లెక్స్ కంటే సింగిల్ స్క్రీన్స్ ద్వారానే ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తున్న నేపథ్యంలో బెనిఫిట్ షోల విషయంలో సింగిల్ స్క్రీన్స్ పై దృష్టి పెట్టారని భోగట్టా.
దేవర, వర కాంబినేషన్ షాట్స్ చూపించకపోవడం గురించి కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. అయితే ఇందులో మేకర్స్ తప్పు కూడా లేదని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ 5000 మంది వస్తారని భావిస్తే ఏకంగా 30000 మంది రావడంతో ఈవెంట్ ఆర్గనైజర్స్ సైతం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.
అయితే దేవర మూవీ రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ ఏర్పాటు చేసే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర సినిమాతో భారీ హిట్ సాధించేలా ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర రిలీజ్ ట్రైలర్ మాత్రం అదిరిపోయిందని చెప్పవచ్చు.