బాహుబలి1 (Baahubali) , బాహుబలి2 (Baahubali 2), ఆర్.ఆర్.ఆర్ (RRR), సలార్ (Salaar) , కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలలో తెలుగు భాషకు చెందిన నటులతో పాటు ఇతర భాషల నటీనటులకు సైతం ప్రాధాన్యత దక్కింది. అదే సమయంలో పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే నటులను మాత్రమే ఈ సినిమా కోసం ఎంపిక చేయడం జరిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలు (Star Heroes) పాన్ ఇండియా సినిమాల విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Star Heroes
హిందీ, తమిళ, కన్నడ భాషల నటులకు ప్రాధాన్యత ఇచ్చిన సినిమాలకు ఆ భాషల్లో సైతం రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. అయితే టాలీవుడ్ హీరోలకు తెలుగు, కన్నడ డైరెక్టర్లే బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నారు. తమిళ డైరెక్టర్లను టాలీవుడ్ హీరోలు నమ్ముకున్న చాలా సందర్భాల్లో భారీ షాకులు తగిలాయి. అందువల్ల తమిళ డైరెక్టర్లకు టాలీవుడ్ హీరోలు (Star Heroes) ప్రాధాన్యత ఇవ్వకపోతే మంచిది.
మరోవైపు బాలీవుడ్ హీరోయిన్లకు టాలీవుడ్ సినిమాలలో ప్రాధాన్యత దక్కుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్లు సినిమాలకు బిజినెస్ విషయంలో ఊహించని స్థాయిలో హెల్ప్ అవుతుండటం గమనార్హం. టాలీవుడ్ సినిమాల బడ్జెట్లు భారీ స్థాయిలో పెరుగుతుండగా ఈ సినిమాలకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరుగుతోంది. అయితే ఇతర భాషల నటీనటులు సినిమాకు ప్లస్ అవుతారంటే మాత్రమే వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలలో ఎన్ని సినిమాలు ఇతర భాషల్లో హిట్ గా నిలుస్తాయనే చర్చ సైతం సోషల్ మీడియాలో జరుగుతోంది. అదే సమయంలో టాలీవుడ్ హీరోలు కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుంటే మాత్రమే కోరుకున్న విజయాలు సులువుగా దక్కే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.