ఒక పక్క తమిళ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఒటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి వ్యతిరేకంగా గొడవలు చేస్తుంటే.. తెలుగు నిర్మాతలు మాత్రం ఆ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ను ప్రమోట్ చేయడం లేదా స్థాపించే పనిలో బిజీగా ఉన్నారు. అల్లు అరవింద్ ఇటీవల “ఆహా” అనే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ను స్థాపించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్న ఈ ఆహా ఆల్రెడీ లైవ్ లో ఉంది. ఈ ఓటీటీలో భాగస్వాములు కావాల్సిందిగా అల్లు అరవింద్ తన తోటి టాప్ ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు & సురేష్ బాబులకు ఆహ్వానం పంపాడని, ఇద్దరూ ఇందుకు నో చెప్పారని తెలుస్తోంది.
యాప్ లో ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ను ప్రొడ్యూస్ చేస్తుండడం దిల్ రాజుకు నచ్చక అల్లు అరవింద్ ఆఫర్ ను రిజెక్ట్ చేస్తే.. ఆల్రెడీ థియేటర్లలో జనాలు సినిమా చూడడం మానేశారని.. ఇలాంటి యాప్ లను నిర్మాతలే ప్రమోట్ చేస్తే సినిమాను పూర్తిగా చంపేసినట్లేననే భావనతో సురేష్ బాబు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. మరి ఈ ఓటీటీ పోరు చివరికి ఎలాంటి పర్యవసానాన్ని ఇస్తుందో చూడాలి.