స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) తాజా ప్రాజెక్ట్‌పై స్పష్టత రాకపోవడంతో సినీ వర్గాల్లో అనేక ఊహాగానాలు వచ్చిపడుతున్నాయి. గుంటూరు కారం (Guntur Kaaram) తర్వాత ఆయన మరో సినిమా ఎప్పుడెప్పుడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మొదట అల్లు అర్జున్‌తో (Allu Arjun) ఓ భారీ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తుండగా, బన్నీ అట్లీతో (Atlee Kumar) సినిమా మొదలుపెట్టడంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఓ చిన్న సినిమా చేయనున్నారంటూ వార్తలు వచ్చాయి.
వెంకటేష్‌తో (Venkatesh) ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నట్టు, అలాగే రామ్‌తో (Ram) ఓ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ చర్చల్లో ఉందన్న టాక్ వినిపించింది. ‘నువ్వే నువ్వే’ (Nuvve Nuvve) నుంచి త్రివిక్రమ్-స్రవంతి రవికిషోర్ (Sravanthi Ravi Kishore) మధ్య ఉన్న అనుబంధం వల్ల రామ్ సినిమా గ్రీన్ సిగ్నల్ అవుతుందన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ వార్తలన్నింటిపై త్రివిక్రమ్ టీమ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. త్రివిక్రమ్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులకు ఎలాంటి కమిట్‌మెంట్ ఇవ్వలేదని పేర్కొన్నారు.
అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ వర్క్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన త్రివిక్రమ్, పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని కథను డిజైన్ చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా, బన్నీ అట్లీ సినిమాతో బిజీగా ఉండటంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కి మరో ఏడాది వరకు టైం పట్టే అవకాశముంది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ బౌండెడ్ స్క్రిప్ట్‌ను మరింత గట్టిగా తయారు చేయాలని చూస్తున్నారట. కథతో పాటు, డైలాగ్స్, ఎమోషనల్ బ్లాక్స్ అన్నింటిని మెరుగుపరచాలని ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి త్రివిక్రమ్ అభిమానులు మరోసారి ఓపిక పట్టాల్సిందే. ఆయన నుంచి వచ్చే సినిమా ఆలస్యంగా అయినా భారీగా ఉండబోతోందన్న నమ్మకం మాత్రం ఫ్యాన్స్‌లో యథావిధిగా ఉంది. బన్నీ ఫ్రీ అయిన వెంటనే ఈ క్రేజీ కాంబో మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది. అప్పటివరకు త్రివిక్రమ్ ఖాళీగా కనిపించినా, స్క్రిప్ట్ రూమ్‌లో మాత్రం బిజీబిజీగా ఉంటారని చెప్పొచ్చు.