పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఏప్రిల్ 9న విడుదలయ్యింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది.3 ఏళ్ళ తరువాత పవన్ కళ్యాణ్ నుండీ వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇదంతా మొదటి వారం వరకే పరిమితమైంది. ఆ తరువాత కలెక్షన్లు డౌన్ అయ్యాయి. దీనికి కారణం రాజకీయ కుట్ర,కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
దీంతో ‘వకీల్ సాబ్’ బ్రేక్ ఈవెన్ అయితే కాలేదు కానీ.. పవన్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.ఇక 3 వారాలకే అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదలైన ‘వకీల్ సాబ్’ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అదేంటి అంటే.. ‘వకీల్ సాబ్’ అమెజాన్ ప్రైమ్లో విడుదల అయిన గంటలోనే పైరసీ భారిన పడటం. ఒరిజనల్ వెర్షన్ పలు వెబ్ సైట్లలో దర్శనమిచ్చింది. దీనిని అరికట్టే ప్రయత్నాలు నిర్మాత దిల్ రాజు సైడ్ నుండీ ఏమీ జరగడం లేదని వినికిడి.
అతనికి ఇది పెద్ద నష్టం తెచ్చే విషయం కాదు. కానీ ఇలా ఒరిజనల్ వెర్షన్ లీక్ అవ్వడం వలన చాలా మంది మొబైల్స్ లో డౌన్ లోడ్ చేసుకుని ఈ సినిమాని రిపీటెడ్ గా చూసేస్తుంటారు. దాంతో ఓటీటికి వ్యూయర్ షిప్ అనేది తగ్గిపోతుంది, రికార్డులు కూడా ఏమీ నమోదు కావు. దీంతో అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో కూడా ‘వకీల్ సాబ్’ కు ఎదురీత తప్పడం లేదు.