విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటిస్తున్న కొత్త చిత్రం కింగ్‌డమ్ (Kingdom) పై రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ కు ముందు పెద్దగా సౌండ్ చేయలేదు. కానీ టీజర్ తరువాత KGF లాంటి ట్రీట్ అని చెప్పకనే చెప్పేసింది. ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగా, కథ, మేకింగ్ పై క్యూరియాసిటీను పెంచేసింది. తాజాగా ఈ సినిమా టీం శ్రీలంక వెళ్లడం, అక్కడ ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఇది సాధారణ పాట షూట్ కాదని తెలుస్తోంది. కథలో కీలక మలుపు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందట. మొత్తం ఐదు రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్‌లో శ్రీలంక పాపులర్ లొకేషన్లలో షూటింగ్ చేయబోతున్నారు. ముఖ్యంగా టూరిజం స్పాట్స్ అయినా కూడా కథలో భాగంగా ఓ ఇంటెన్స్ నేరేషన్‌కి నేపథ్యంగా ఉంటాయని సమాచారం. ఈ పాటలో విజువల్ మేజిక్‌తో పాటు కథనంలోని కీలక పరిణామాలను హై లైట్ చేసే ప్రయత్నం కనిపించబోతుందని టాక్.
ఇప్పటికే ఈ సినిమా కథకు 1980లలో జరిగిన శ్రీలంక సివిల్ వార్ కనెక్షన్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ ఓ రెబల్ పాత్రలో కనిపించబోతున్నాడట. ప్రజల పక్షాన పోరాడే పాత్రలో అతడు మిలిటరీ శక్తులకు ఎదురు నిలిచే స్టైల్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిజైన్, మిలిటరీ బేస్డ్ లొకేషన్లు చూస్తే ఈ హిపోతసిస్‌కి బలం కలుగుతోంది.
సింగిల్ మ్యాన్ అగెనెస్ట్ సిస్టమ్ కాన్సెప్ట్ పై దర్శకుడు గౌతమ్ మాసివ్ ఫిక్షన్ స్టోరీని తీసుకువస్తున్నట్లు ఫీలింగ్ వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ నటిస్తున్న సంగతి తెలిసిందే. గ్లామర్ కంటే ఎమోషనల్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉండే క్యారెక్టర్ గా ఆ పాత్రను డిజైన్ చేశారట. ఈ సినిమా ద్వారా భాగ్యశ్రీకి (Bhagyashree Borse) టాలీవుడ్‌లో మేజర్ బ్రేక్ లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 30న పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా, శ్రీలంక షెడ్యూల్‌తో సినిమా కీలక ఘట్టం ముగియనుంది. తర్వాత థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్ రిలీజ్‌కు మేకర్స్ రెడీ అవుతున్నారు. వేసవి బాక్సాఫీస్ రేసులో కింగ్‌డమ్ ఎలాంటి అంచులకు చేరుతుందో చూడాలి.