విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అభిమానులకు ఇది నిజంగా ఓ స్పెషల్ సర్‌ప్రైజ్. ఇప్పటికే కింగ్‌డమ్ తో (Kingdom) ఒక బిగ్ టికెట్ మూవీ చేస్తున్న విజయ్, ఆ తర్వాత రవి కిరణ్ కోలా (Ravi Kiran Kola) డైరెక్షన్‌లో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక టైటిల్ అనౌన్స్ కాకపోయినా, తాజాగా నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఒక రేంజ్ లో లీక్ ఇచ్చేశాడు. విజయ్ ఫ్యాన్స్ అనుకుంటున్నదే నిజమైందని కన్ఫామ్ చేస్తూ, ఈ సినిమా టైటిల్ రౌడీ జనార్ధన్ అని చెప్పేశాడు.
దిల్ రాజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu) రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ లీక్ ఇచ్చేశాడు. ముందుగా ఆలోచించి చెప్పారా లేక అనుకోకుండా బయటపెట్టారా అనే సందేహం ఉన్నప్పటికీ, టైటిల్ ప్రకటించిన వెంటనే విజయ్ (Vijay Deverakonda), ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా, రౌడీ జనార్ధన్ అనే టైటిల్‌తో రియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్ విజయ్ దేవరకొండ స్టైల్ కి పర్ఫెక్ట్‌గా సరిపోతుందని అంటున్నారు. విజయ్ దేవరకొండకు ‘రౌడీ’ అనే ట్యాగ్ ఎప్పటి నుంచో ఉంది.
తన ఫ్యాన్స్‌ను కూడా రౌడీస్ అంటూ సంబోధించే విజయ్, ఇలా తన బ్రాండ్‌కు తగ్గ టైటిల్ ఓకే చేయడం చాలా స్పెషల్ అని చెప్పాలి. అయితే, ఇటీవలే ‘ది దేవరకొండ’ అనే కొత్త ట్యాగ్‌తో తన కొత్త ఫేజ్‌ను స్టార్ట్ చేసిన విజయ్ (Vijay Deverakonda), మళ్లీ ‘రౌడీ’ టైటిల్‌ను ఓకే చేయడం వెనుక ప్రత్యేక కారణాలున్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రాలేదు. కానీ దిల్ రాజు మాత్రం సినిమా ఫై ప్రిప్రొడక్షన్ స్టేజ్ నుంచే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
రవి కిరణ్ కోలా ఇప్పటికే స్క్రిప్ట్ పై పూర్తి గ్రిప్ సాధించినట్లు టాక్. ఇక మే నెల నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ టైటిల్ లీక్ తర్వాత, విజయ్ (Vijay Deverakonda) ఫ్యాన్స్ ఆనందంతో మరో లెవెల్ లో రియాక్షన్ ఇస్తున్నారు. కింగ్‌డమ్ టీజర్ చూసి ఇది హిట్ అని ఫిక్స్ అయిన అభిమానులు, ఇప్పుడు రౌడీ జనార్ధన్ టైటిల్ తో మరింత ఎగ్జైట్ అవుతున్నారు.