Vijay Devarakonda, Ram Charan: గుర్రంపై విజయ్.. ఎప్పటికైనా కొంటానంటూ?
- November 23, 2021 / 10:34 AM ISTByFilmy Focus
యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినీ కెరీర్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లైగర్ సినిమా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం వెగాస్ లో లైగర్ మూవీ షూటింగ్ జరుగుతోంది. తాజాగా విజయ్ హార్స్ రైడింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తెలుగు హీరోలలో చాలామంది హీరోలకు హార్స్ రైడింగ్ అంటే ఎంతో ఇష్తం. చిరంజీవి, బాలకృష్ణ, చరణ్ లకు హార్స్ రైడింగ్ ఇష్టం కాగా ఇప్పటికే పలు సినిమాలలో హార్స్ రైడింగ్ చేసి ఈ హీరోలు మెప్పించారు. చరణ్ ఫాం హౌస్ లో ఇప్పటికే గుర్రాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే యంగ్ హీరో విజయ్ కూడా గుర్రాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు.

హార్స్ రైడింగ్ చేస్తూ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన విజయ్ దేవరకొండ తనకు గుర్రాలు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. త్వరలోనే గుర్రాన్ని సొంతం చేసుకుంటానని విజయ్ అన్నారు. గుర్రం విషయంలో చరణ్ బాటలో విజయ్ నడుస్తుండటం గమనార్హం. విజయ్ తర్వాత సినిమా డైరెక్టర్ల జాబితాలో సుకుమార్, శివ నిర్వాణ ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా లైగర్ కావడం గమనార్హం.
Riding horses.
I love horses, I want one of my own. Soon 🙂#Liger pic.twitter.com/nS4pVRZY73
— Vijay Deverakonda (@TheDeverakonda) November 22, 2021
పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!













