అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగాక గుర్తించనవసరం లేదు అనే సినిమా డైలాగ్ కొన్ని సినిమాలకు సరిగ్గా సరిపోతుంది.. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకాభిమానులను ఆకట్టుకోలేకపోయిన చిత్రాలు ఓటీటీల్లోనూ, టెలివిజన్ ప్రీమియర్స్ అప్పుడు అదరగొట్టేస్తుంటాయి.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మెగా మల్టీస్టారర్ ‘ఆచార్య’ విషయంలో అలాంటి మ్యాజిక్కే జరిగింది..‘మగధీర’, ‘బ్రూస్ లీ’, ‘ఖైదీ నెం:150’ సినిమాల తర్వాత చిరు, చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం ‘ఆచార్య’..
ఆ మూడు సినిమాల్లో బాస్ జస్ట్ గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తే.. ఇందులో ఆయన హీరోగా.. తనయుడు చెర్రీ ఇంపార్టెంట్ రోల్ చేశాడు.. వరుస సూపర్ హిట్స్ ఇచ్చిన కొరటాల శివ దర్శకుడు కావడంతో కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో భాగస్వామ్యం కూడా వహించింది.. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఊహించని షాక్ ఇచ్చింది.. భారీ హైప్ కారణంగా అంచనాలను అందుకోలేకపోయింది..తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో తెలుగతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది..
‘ఆచార్య’ శాటిలైట్ రైట్స్ తీసుకున్న జెమిని టీవీ అక్టోబర్ 23 సాయంత్రం 5:30 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేసింది. థియేటర్లలోనే సరిగా ఆడలేదు పైగా ఓటీటీలో అందుబాటులో ఉంది.. ఇక టీవీలో ఎవరు చూస్తారులే అనుకున్నారంతా.. కట్ చేస్తే.. ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ టీఆర్‌పీ రేటింగ్ చూసి అందరూ షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురయ్యారు.. ఈ మెగా మ్యాజిక్ చూసి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు..
‘ఆచార్య’ కి 6.30 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది.. ‘సైరా’, ‘ఖైదీ నెం:150’ ల కంటే ఇది తక్కువే అయినా.. అసలు చూడరు అనుకున్నదానితో పోలిస్తే బెటర్ అనే చెప్పుకోవాలి.. దాదాపు వంద కోట్లకు పైగా వ్యయంతో తెరకెక్కిన ‘ఆచార్య’ 70 కోట్లు మాత్రమే రాబట్టి బయ్యర్లకి నష్టాలను మిగిల్చింది.. మరో భాగస్వామితో పాటు తాము కూడా లాస్ కావడంతో చిరు, చరణ్ తమ రెమ్యునరేషన్స్ వదులుకోవడం విశేషం..