విజయ్ సినిమాలోనూ ఆ హీరోయినే.. ఆ సినిమాలో ఫిక్స్ చేయడానికా?
- March 29, 2025 / 03:00 PM ISTByFilmy Focus Desk
దిల్ రాజు (Dil Raju) కాంపౌండ్‌లో ఓ దర్శకుడు అడుగుపెట్టారు అంటే.. కనీసం రెండు సినిమాలు చేయాల్సిందే అని అంటారు. ఆయన మరి అగ్రిమెంట్ రాయించుకుంటారో, లేక దర్శకులే ఆయనకు అటాచ్ అయిపోతారో కానీ మినిమమ్ రెండు సినిమాలు చేసేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ హీరోయిన్ ఆ కాంపౌండ్‌లోకి కొత్తగా వస్తోంది. రావడమే కాదు ఏక కాలంలో అదే బ్యానర్‌లో రెండు సినిమాలు చేస్తోంది అని ఓ టాక్ నడుస్తోంది. దిల్ రాజు కాంపౌండ్‌లో ఓ సినిమా గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది.
Vijay Devarakonda

‘బలగం’ (Balagam) సినిమా ఫేమ్ వేణు యెల్దండి (Venu Yeldandi) దర్శకత్వంలో ‘ఎల్లమ్మ్మ’ అనే సినిమా చేయాలి అనేది ఆ చర్చ. దీని కోసం చాలామంది హీరోలు వచ్చారు వెళ్లారు. నాని (Nani) , శర్వానంద్ ( Sharwanand) అంటూ చాలా పేర్లు వినిపించి.. ఆఖరికి నితిన్ (Nithiin Kumar) పేరు ఫైనల్ అయింది అని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ (Keerthy Suresh) నటిస్తోంది అని ఇప్పటికే వార్తలొచ్చాయి.
ఆ సినిమా సంగతి ఇంకా తేలలేదు ఇప్పుడు ఆ బ్యానర్‌లోనే కీర్తి మరో సినిమా ఓకే చేసింది అంటున్నారు. అదే జరిగితే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సరసన కీర్తి త్వరలో కనిపించనుంది. ‘కింగ్ డమ్’ సినిమా త్వాత విజయ్ ‘రాజావారు రాణీవారు’ ఫేమ్ రవికిరణ్ కోలా (Ravi Kiran Kola) దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. దీనికి ‘రౌడీ జనార్దన్’ అనే పేరు కూడా పెట్టారు. ఈ సినిమాలోనే కీర్తి నటిస్తోందట. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందట.

‘రౌడీ జనార్దన్’ సినిమా మే నెల నుండి స్టార్ట్ చేయాలని విజయ్ (Vijay Devarakonda) ప్లాన్ చేస్తున్నాడట. అయితే ‘కింగ్ డమ్’ (Kingdom) పనులు పూర్తవ్వడం మీదే ఇది ఆధారపడి ఉంది. అప్పుడు కీర్తి సురేశ్ డబుల్ మూవీ చేస్తోందా? లేదా అనేది క్లారిటీ వస్తుంది. అన్నట్లు ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) తర్వాత ఆమె నుండి తెలుగులో సినిమా ఏదీ రాలేదు. హిందీలో మొన్నీమధ్య ‘బేబీ జాన్’(Baby John) చేసింది.












