ఎన్నో సినిమాలలో తన నటనతో అందరిని మెప్పించినటువంటి పావలా శ్యామల వయసు పై పడటంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె ప్రస్తుతం మాత్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. సినిమా అవకాశాలు లేక వయసు పై పడటంతో ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కూతురు మంచానికే పరిమితం కావడంతో
తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ గతంలో ఈమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ఈమెకు ఆర్థిక సహాయం చేశారు ఇలా వారు ఆర్థిక సహాయం చేసినప్పటికీ అది తాత్కాలికంగా మాత్రమే అండగా నిలిచిందని తెలిపారు. తన కుమార్తెకు మందులు తీసుకురావడానికి కూడా డబ్బులు లేకపోవడంతో తన అవార్డులన్నింటిని అమ్మి తనకు మందులు ఇంట్లోకి బియ్యం పప్పులు తెచ్చుకొని కడుపు నింపుకున్నామని
అయితే ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు అధికమవడంతో కొన్నిసార్లు ఆకలి అనుభవిస్తూ కూడా బ్రతికిన సందర్భాలు ఉన్నాయని ఈమె తెలియజేశారు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం తన వల్ల కాలేదని ఆత్మహత్య చేసుకుందాము అంటే ధైర్యం సరిపోవడం లేదని ఎమోషనల్ అయ్యారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు వయోభారం కారణంగా జీవితమే భారంగా మారిపోయిందని ఇలాగే గడిస్తే ఏదో ఒక రోజు ఆకలి కేకలతోనే తాను తన కూతురు చనిపోతాము అంటూ ఈ సందర్భంగా పావలా శ్యామల చేసినటువంటి ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.
కడుపు నింపుకోవడానికి డబ్బులు లేవు అలాంటిది తన కుమార్తెకు మందులు తీసుకురావడానికి ఎలా సాధ్యపడుతుంది అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దీన పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి ఈమెకు (Pavala Syamala) ఇండస్ట్రీ అండగా నిలబడాలని కోరుకుంటున్నారు.