సినిమా రోజుకో సరికొత్త రంగు పులుముకుంటుంది. మొదట్లో రెండే రెండు జోనర్స్ ఉండేవి, ఇప్పుడు ఆలోచనకో జోనర్ చొప్పున లెక్కలేనన్ని జోనర్లు క్రియేట్ అయ్యాయి. అందులో ప్రేక్షకుల్ని ఇబ్బందిపెడుతున్నవి రెండు జోనర్లు.. 1) అడల్ట్ కామెడీ, 2) డార్క్ కామెడీ. అడల్ట్ కామెడీ జోనర్ లో డబుల్ మీనింగ్ జోకులు, శృతి మించిన శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ జోనర్ కేవలం పెద్దలకు మాత్రమే. రెండోది డార్క్ కామెడీ, బ్లర్ లేని సెక్స్ సీన్స్, పచ్చి మాటలు కాస్త ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే.. ఈ డార్క్ కామెడీ జోనర్ ను అడ్డుపెట్టుకొని పచ్చి మాటలు కాక పచ్చిబూతులు తిట్టుకోవడం, ఆ బూతులతో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారు.
ఇప్పుడు తాజాగా “దెబ్బకు ఠా దొంగల ముఠా” అనే సినిమా వస్తోంది. “అమీ తుమీ” చిత్రంతో కథానాయికగా పరిచయమైన అదితి, కత్తి మహేష్, కిరీటి తదితరులు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ కమ్ టీజర్ ను నిన్న విడుదల చేశారు. ఈ వీడియోలో హీరోయిన్ అదితి మ్యాకల్ చాలా సింపుల్ గా “గు*** దమ్ము లేదు” అనేస్తుంది. ఇది పచ్చి బూతు, అప్పట్లో “అంతఃపురం” సినిమాలో ప్రకాష్ రాజ్ ఇదే మాటను అంటే అప్పట్లో పట్టించుకోలేదు కానీ.. రీసెంట్ గా ఆ మాటను మ్యూట్ చేశారు. ఈ సినిమాలోనూ సెన్సార్ వాళ్ళు ఎలాగూ ఆ డైలాగ్ ను మ్యూట్ చేస్తారనుకోండి. కానీ.. కేవలం ఎట్రాక్ట్ చేయడం కోసం ఇలా బూతులు పెట్టేసి దానికి “డార్క్ కామెడీ” అని రంగు పులమడం ఎంతవరకూ సమంజసం అనేది సదరు సినిమా మేకర్స్ దృష్టికే వదిలేస్తున్నాం.