Allu Arjun, Atlee: అట్లీ- అల్లు అర్జున్.. సినిమా ఆగిపోదు కదా..!
- June 21, 2025 / 12:47 PM ISTByPhani Kumar
అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ వంటి పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న తర్వాత తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో ఒక సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇదొక అడ్వెంచరస్ డ్రామా అని మేకింగ్ వీడియోతో చెప్పకనే చెప్పారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనె (Deepika Padukone) ని ఇందులో మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు.
Allu Arjun, Atlee
ఇదిలా ఉంటే.. ఈ సినిమా నిర్మాత చిక్కుల్లో పడినట్టు చర్చలు నడుస్తున్నాయి. విషయంలోకి వెళితే.. అల్లు అర్జున్ (Allu Arjun)- అట్లీ (Atlee Kumar) సినిమాని నిర్మిస్తున్న కళానిధి మారన్ పై మనీ లాండరింగ్ ఆరోపణలు వ్యక్తమయ్యాయి. స్వయంగా కళానిధి మారన్ సోదరుడు దయానిధి మారన్ ఈ ఆరోపణలు చేసి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది.

- 1 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
- 2 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
- 3 ‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు
- 4 33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!
- 5 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
కళానిధి మారన్ తో పాటు మరో 7 మందికి అతను నోటీసులు పంపినట్టు స్పష్టమవుతుంది.’మనీలాండరింగ్ మాత్రమే కాకుండా అతను పాల్పడ్డ ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కూడా పాయింటవుట్ చేసి పేర్కొన్నారు దయానిధి మారన్.

ఈ క్రమంలో కళానిధి మారన్ పై, సన్ టీవీ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని, కంపెనీకి సంబంధించిన ఫైనాన్సియల్ అకౌంట్స్ ను కూడా కూడా చెక్ చేయాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు దయానిధి. ఈ ఇష్యూ వల్ల అల్లు అర్జున్ (Allu Arjun)- అట్లీ (Atlee Kumar) సినిమా షూటింగ్ కి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో..!

















