‘కింగ్’ నాగార్జున,యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది.జనవరి 14న సంక్రాంతి కానుకగా ‘బంగార్రాజు’ విడుదలయ్యింది.సినిమాకి కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి.కానీ వీక్ డేస్లో మాత్రం ‘బంగార్రాజు’ స్లో అయ్యాడు.
మొదటి వారం పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం రెండో వారం చాలా డౌన్ అయ్యింది. నైజాంలో అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.’బంగార్రాజు’ 2 వారాల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
8.19 cr
సీడెడ్
7.32 cr
ఉత్తరాంధ్ర
4.90 cr
ఈస్ట్
3.96 cr
వెస్ట్
2.83 cr
గుంటూరు
3.45 cr
కృష్ణా
2.18 cr
నెల్లూరు
1.84 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
34.67 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
3.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
37.87 cr
‘బంగార్రాజు’ చిత్రానికి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. రెండు వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.37.87 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.13 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వారం ఈ చిత్రం రూ.3.3 కోట్ల వరకు మాత్రమే షేర్ ను రాబట్టింది.
ఆంధ్రాలో 50 శాతం ఆక్యుపెన్సీ తోనే థియేటర్లు రన్ అవ్వడం అలాగే కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా పడడంతో ‘బంగార్రాజు’ కలెక్షన్లు డల్ అయినట్టు క్లియర్ గా స్పష్టమవుతుంది. నైజాంలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు లేవు. ఈ 3వ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటేనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది.