Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » అందుకే రాక్ష‌సుడు నా మొదటి సినిమా అని చెప్పా: బెల్లంకొండ శ్రీనివాస్‌

అందుకే రాక్ష‌సుడు నా మొదటి సినిమా అని చెప్పా: బెల్లంకొండ శ్రీనివాస్‌

  • August 2, 2019 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందుకే రాక్ష‌సుడు నా మొదటి సినిమా అని చెప్పా: బెల్లంకొండ శ్రీనివాస్‌

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా ‘రైడ్‌’, ‘వీర’ చిత్రాల దర్శకుడు రమేష్‌వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఎ హవీష్‌ లక్ష్మణ్‌ కొనేరు ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ప్రముఖ విద్యావేత్త కొనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘రాక్షసుడు’. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్‌2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇంటర్వ్యూ….

`రాక్షసుడు` చేసిన అనుభవం ఎలా ఉంది?

bellamkonda-srinivas-special-interview-about-rakshasudu-movie2

– మామూలుగా సినిమా మొదలుపెట్టిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు ప్యాకప్‌ అయిపోతే నేను సినిమా నుండి డిటాచ్‌ అవుతా. కానీ ఈ సినిమా విషయంలో నేను డిటాచ్‌ కాలేకపోయాను. ఎక్కడ చూసినా పత్రికల్లో మా సినిమాలో జరిగిన ఘటనలకు రిలేట్‌ అయ్యే ఇంటర్వ్యూలే కనిపించేవి. మామూలుగా అయితే వాటిని మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఈ సినిమాతో అవి నాకు చాలా కనెక్ట్‌ అయ్యాయి.

పోలీస్‌ ఆఫీసర్‌గా సెకండ్‌ టైమ్‌ నటించడం ఎలా అనిపిస్తోంది?

bellamkonda-srinivas-special-interview-about-rakshasudu-movie3

– నేను పోలీస్‌ ఆఫీసర్‌గా ‘కవచం’ చేశాను కానీ, ఎక్కడో ప్రేక్షకులకు అంతగా కనెక్ట్‌ కాలేదు. కానీ ఈ సారి పోలీస్‌ ఆఫీసర్‌గా చేయడం నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో యాక్షన్‌ లేదు, పాటలు, డ్యాన్సులూ లేవు. డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో నా మరదలి పాత్రకు దారుణం జరుగుతుంది. అలాంటి దారుణాన్ని ఇంట్లో వాళ్లకు జరిగినట్టు కూడా మనం ఊహించుకోలేం. నేను కూడా మా ఇంట్లో కొందరు అమ్మాయిలను నా చేతుల మీదుగా పెంచా. అలాంటివారి విషయంలో ఇలా జరిగితే నేను తట్టుకోలేను. అందుకే అదంతా మనసుకు బాగా కనెక్ట్‌ అయింది. అందుకే సినిమాతో డిటాచ్‌ కాలేకపోయా.

రాక్షసుడు ఎలా ఉంటుంది?

bellamkonda-srinivas-special-interview-about-rakshasudu-movie4

– ఇన్వెస్టిగేటివ్‌ కాప్‌ స్టోరీగా ఉంటుంది. ఓ విషయంలో ఒకడు రాక్షసుడిగా ప్రవర్తిస్తుంటాడు? వాడు ఎవరు? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? వాడిని సీఐ ఎలా పట్టుకున్నాడనేదే కథ. చాలా ఇంటెన్సివ్‌గా సాగే థ్రిల్లర్‌.

రమేష్ వర్మ లాంటి కొత్త దర్శకుడితో మూవీ ఎలా అనిపించింది?

bellamkonda-srinivas-special-interview-about-rakshasudu-movie5

– కొత్త దర్శకుడు అనికాదు, ఈ చిత్రంలో కథే హీరో. అది నమ్మి చేయడం జరిగింది.

ఈ సినిమాలో నెగటివిటీ ఎక్కువగా ఉన్నట్లుంది?

bellamkonda-srinivas-special-interview-about-rakshasudu-movie6

– దాన్ని పూర్తిగా నెగటివిటీ అని అనలేం కానీ, అంత ఇంటెన్సిటీ మాత్రం ఉంటుంది. మామూలుగా నేను నెగటివిటీకి దూరంగానే ఉంటాను. ఎక్కడ పాజిటివ్‌ వాతావరణం ఉంటే, అక్కడ నేనుంటాను.

పరిశ్రమకు వచ్చిన ఐదేళ్ల తర్వాత ‘ఇదే నా మొదటి సినిమా’ అని చెప్పారు?

bellamkonda-srinivas-special-interview-about-rakshasudu-movie7

– ఇన్ని రోజులు నేను మా దర్శకులు ఏం చెబితే అదే చేశా. నాకోసం ‘ఇంకో టేక్‌ చేద్దాం సార్‌’ అని కూడా ఎవరితోనూ అనలేదు. కానీ ఈ సినిమాకు ఆ స్వాతంత్రం వచ్చింది. అందువల్ల ఇంకా ఎక్కువ బాగా చేయగలిగాను. 85 రోజులు షూటింగ్‌ చేశా. నిర్విరామంగా ఆదివారం, సెలువులు లేకుండా పనిచేశా. ఎక్కువగా నైట్‌ షూటింగ్‌లు జరిగాయి. అందుకే అలా ఫీలయ్యా.

ఇంతకు ముందువాటిని తక్కువ చేసిన భావన కలగలేదా?

bellamkonda-srinivas-special-interview-about-rakshasudu-movie8

– అలా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే నా ప్రతి సినిమాకూ నేను ప్రాణం పెట్టి పనిచేస్తాను. గత ఏడాది జులై నుంచి ఈ జులై వరకు మూడు సినిమాలు విడుదలయ్యాయి అని అంటే… అవి చిన్న చిత్రాలైతే ఫర్వాలేదు కానీ, అవి పెద్ద చిత్రాలు. వాటిని చేయడం అంత మామూలు విషయం కాదు.

రెండోసారి రీమేక్‌ చేస్తున్నారు. కష్టంగా ఏమైనా అనిపించిందా?

bellamkonda-srinivas-special-interview-about-rakshasudu-movie9

– అలా ఏమీ అనిపించలేదు. రీమేక్‌ ఎప్పుడూ 90 శాతం ఈజీగానే ఉంటుంది. 10 శాతం కష్టంగా ఉంటుంది. ఆ కష్టం కూడా కంపేరిజన్‌ వస్తుందనే తప్ప మిగతాది ఈజీగానే ఉంటుంది.

సినిమా చూశారా? నచ్చిందా?

bellamkonda-srinivas-special-interview-about-rakshasudu-movie10

– నా ఫ్రెండ్స్‌ తో కలిసి చూశాను. నాతో పాటు నా ఫ్రెండ్స్‌కి కూడా నచ్చింది. రియల్‌ కాప్‌గా ఉన్నానని అన్నారు. మా ఇంట్లో వాళ్లు కూడా చూశారు. వారికి కూడా బాగా నచ్చింది.

మాస్‌ సినిమాలకు దూరంగా వెళ్తున్న భావన కలగడం లేదా?

bellamkonda-srinivas-special-interview-about-rakshasudu-movie11

– డ్యాన్సులు, ఫైట్లు మిస్‌ అవుతున్న ఫీలింగ్‌ నాక్కూడా ఉంది. ఈ కథలో వాటిని జోడిస్తే ఆడియన్స్‌కి ఆ ఫీల్‌ మిస్సవుతుంది. అందుకనే తమిళ వెర్షన్‌కి సాధ్యమైనన్ని తక్కువ మార్పులు చేశాం.

ఈ చిత్రం తరువాత కమర్షియల్ మూవీస్ చేస్తారా లేక కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు చేస్తారా?

bellamkonda-srinivas-special-interview-about-rakshasudu-movie12

– నెక్స్ట్ కమర్షియల్ మూవీనే చేయాలని ఆలోచన ఉంది. ఆ కమర్షియల్ చిత్రాలలో ఉండే డాన్స్ లు ఫైట్లు మిస్ అవుతున్నాను (నవ్వుతూ)

మీ నాన్న ఏమంటున్నారు?

bellamkonda-srinivas-special-interview-about-rakshasudu-movie13

– ఆయన పూర్తిగా కమర్షియల్‌ ప్రొడ్యూసర్‌. ఎక్కడ సక్సెస్‌ ఉంటే, ఆ కాంబినేషన్‌లో సినిమా చేయడానికి ఇష్టపడతారు.

Click Here For Movie Review

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran
  • #Bellamkonda Sai Sreenivas
  • #Rakshasudu Collections
  • #Rakshasudu Movie
  • #Rakshasudu Movie Review

Also Read

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

related news

Bison Trailer: ‘బైసన్‌’ వచ్చేశాడు.. కబడ్డీ నేపథ్యంలో విక్రమ్‌ కొడుకు మ్యాజిక్‌ చేస్తాడా?

Bison Trailer: ‘బైసన్‌’ వచ్చేశాడు.. కబడ్డీ నేపథ్యంలో విక్రమ్‌ కొడుకు మ్యాజిక్‌ చేస్తాడా?

Tyson Naidu: నేనున్నా అంటున్న బెల్లంకొండ.. క్రిస్మస్‌కి త్రిముఖ పోరు ఖాయమా?

Tyson Naidu: నేనున్నా అంటున్న బెల్లంకొండ.. క్రిస్మస్‌కి త్రిముఖ పోరు ఖాయమా?

trending news

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

23 hours ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

24 hours ago
K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

24 hours ago
Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

1 day ago
పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

1 day ago

latest news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

4 hours ago
Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

5 hours ago
Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

5 hours ago
Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

5 hours ago
Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version