‘దేవర 1’ (Devara) విడుదలైన సమయంలో మొదట వచ్చిన మిక్స్డ్ టాక్ నిర్మాతలలో కాస్త గందరగోళాన్ని సృష్టించింది. కానీ అనిరుధ్ (Anirudh Ravichander) మ్యూజిక్, ఎన్టీఆర్ (Jr NTR) మాస్ క్రేజ్ సినిమాను లాభాల్లోకి తీసుకువచ్చాయి. ‘దేవర 2’పై అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నా, మేకర్స్ నుంచి క్లారిటీ రాకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నార్త్ మార్కెట్‌లో ‘దేవర 1’ మంచి క్రేజ్ సంపాదించినప్పటికీ, రెండో భాగంపై ఇంకా నిర్ణయం తీసుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల వచ్చిన టాక్ ప్రకారం, ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సాధించిన గ్రాండ్ సక్సెస్ ‘దేవర 2’ మీద ఆశలు పెంచిందని సమాచారం.
‘పుష్ప 2’ 1800 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసి, హిందీలో కూడా 800 కోట్ల మార్క్ దాటింది. ఈ విజయంతో పాన్ ఇండియా సినిమాలపై మాస్ హీరోల దృష్టి మరింతగా పడింది. మేకర్స్ కూడా ‘దేవర 2’ స్క్రిప్ట్‌ను పక్కాగా ప్లాన్ చేసి, అదే స్థాయిలో మార్కెట్‌ను టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘పుష్ప’ (Pushpa) సిరీస్ తరహాలో కరెక్ట్ ఎలివేషన్స్, స్ట్రాంగ్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఉంటే సెకండ్ పార్ట్ సక్సెస్ సాధించవచ్చు.
ఇప్పటికీ కొరటాల శివ (Koratala Siva) ‘దేవర 2’ (Devara 2) కథనంపై మరింత ఫోకస్ పెట్టి, పాన్ ఇండియా ప్రేక్షకులకు ఆకట్టుకునేలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు, హిందీ మార్కెట్‌లో మరింత ప్రాధాన్యత ఇచ్చేలా స్క్రిప్ట్‌ను మలచాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాలకు ఎన్టీఆర్ తప్ప మరే హీరో అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని అనిపిస్తోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ ఫైనల్ షెడ్యూల్‌తో పాటు ప్రశాంత్ నీల్‌తో మరో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ గ్యాప్‌లో ‘దేవర 2’ షూటింగ్‌ను స్టార్ట్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత ప్లాన్ ప్రకారం, ఈ సినిమా స్క్రిప్ట్‌ను మొదట పార్ట్ కంటే , గ్రాండియర్‌గా రూపొందించాలని కొరటాల టీమ్ భావిస్తోంది.