టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja) మరోసారి సూపర్ యోధుడిగా మిరాయ్ (Mirai) పేరుతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే హనుమాన్ సినిమాతో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న తేజా, మిరాయ్ సినిమాతో అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాడు. కానీ ఈసారి ఆయన ఎదుట పోటీ మాత్రం మరింత భీభత్సంగా ఉండబోతోంది. 2025 ఆగస్టు 1న విడుదలవుతున్న మిరాయ్ సినిమాకు అదే సమయంలో రజనీకాంత్ (Rajinikanth) -లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబోలో వస్తున్న కూలీ(Coolie), ఎన్టీఆర్ (Jr NTR) -హృతిక్ రోషన్ (Hrithik Roshan) కలయికలో వస్తున్న వార్ 2 (War 2) వంటి భారీ సినిమాలు పోటీని ఇవ్వబోతున్నాయి.
ప్యాన్ ఇండియా స్థాయిలో గట్టిపోటీ మధ్య మిరాయ్ తన స్థాయిని నిలబెట్టుకోవాలంటే ఇప్పటినుంచే ప్రమోషన్ల మోత మోగించాల్సిందే. ఇప్పటికే మిరాయ్ నుంచి వచ్చిన టీజర్, గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చినా.. సినిమాకు సరైన బజ్ లేవనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. భారీ బడ్జెట్ సినిమాల షాడోలో మిరాయ్ పేరు మర్చిపోవడం జరుగకుండా ఉండాలంటే, మేకర్స్ హనుమాన్ తరహా ప్రమోషన్ స్ట్రాటజీనే అప్‌డేట్ చేయాలి.
ప్రతి అప్‌డేట్‌కు సోషల్ మీడియాలో స్పైసీ కంటెంట్ జత చేసి ముందుకు సాగాలి. ఈసారి కథా నేపథ్యం కూడా కాస్త డిఫరెంట్ అని సమాచారం. భారతీయ ఇతిహాసాల ఆధారంగా ఒక యోధుడి పాత్ర చుట్టూ కథ సాగనుందని ప్రచారం ఉంది. దీంతో వినూత్న అంశాలను హైలైట్ చేస్తూ క్యారెక్టర్ పోస్టర్లు, మేకింగ్ వీడియోలు, స్పెషల్ టీజర్లు రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంటెంట్ బలమైనప్పటికీ, ఈ కాలంలో మార్కెటింగ్ సపోర్ట్ లేకపోతే మూవీ లైమ్‌లైట్‌లో నిలబడటం కష్టం.
మొత్తానికి, మిరాయ్ ఒక పెద్ద బలమైన కథను ఎంచుకున్నా.. అదే స్థాయిలో శబ్దం చేయాల్సిన సమయం ఇది. కూలీ, వార్ 2 లాంటి మల్టీస్టారర్లను ఎదుర్కొనాలంటే, మిరాయ్ టీమ్ సైలెంట్ ప్రమోషన్‌కి బదులుగా ఫుల్ ప్యాచ్ ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే.. బడా సినిమాల గోలల్లో మిరాయ్ గొంతు వినిపించకుండా మిగిలిపోవడం ఖాయం.