జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన ‘దేవర’ (Devara) సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. కళ్యాణ్ రామ్ సమర్పణలో ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్..లతో పాటు పాటలు కూడా మెప్పించాయి. డౌట్ లేకుండా ఈ వారం ప్రేక్షకులకి ఫస్ట్ ఛాయిస్ అంటే ‘దేవర’ మూవీనే అని చెప్పాలి.
Sathyam Sundaram
అయితే దీంతో పాటు కార్తీ (Karthi) నటించిన ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) కూడా రిలీజ్ అవుతుంది. ‘దేవర’ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంటే.. ‘సత్యం సుందరం'(తెలుగు) సెప్టెంబర్ 28 న రిలీజ్ అవుతుంది. తమిళంలో ఒకరోజు ముందుగానే అంటే ‘దేవర’ రిలీజ్ రోజు అయిన సెప్టెంబర్ 27 నే మెయాజ్‌హగన్/’సత్యం సుందరం’ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ తమిళంలో ప్రెస్ కోసం ప్రీమియర్ షోలు వేశారు.
సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా అద్భుతం అంటూ ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్న సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం. ‘సినిమా అద్భుతంగా వచ్చిందని, కార్తీ నటన అద్భుతమని, అతనికి బోలెడన్ని అవార్డులు వస్తాయని, క్లైమాక్స్ అయితే గుండెల్ని పిండేసే విధంగా ఉందని’ ట్విట్టర్ సినిమా చూసిన వాళ్ళు రాసుకొచ్చారు.
అయితే ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా.. ‘దేవర’ వంటి పెద్ద సినిమా పక్కన ‘సత్యం సుందరం’ వంటి డబ్బింగ్ సినిమా నిలబడగలదా? అనే డౌట్ చాలా మందిలో ఉంది. అయితే తెలుగు ప్రేక్షకులకి అలాంటిదేమీ ఉండదు. ఒకవేళ ‘దేవర’ టికెట్స్ దొరకలేని వాళ్ళు.. కచ్చితంగా సినిమాకి వెళ్ళాలి అనుకున్నవాళ్ళు ‘సత్యం సుందరం’ కచ్చితంగా చూసే అవకాశం ఉంది.