కొన్ని క్యారెక్టర్స్ ఎప్పటికీ మన మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. చిన్న పాత్రలే అయ్యినప్పటికీ ప్రేక్షకులు కనీసం పదేళ్ల పాటు మర్చిపోలేని ప్రభావం చూపే రేంజ్ లో ఉంటాయి. అలాంటి పాత్రల్లో ఒకటి కేశవ. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కిన పుష్ప చిత్రం లో అల్లు అర్జున్ అసిస్టెంట్ పాత్ర ఇది. సినిమాలో అల్లు అర్జున్ స్క్రీన్ మీద కనిపించినంతసేపు కేశవ క్యారక్టర్ కూడా కనిపిస్తుంది.
ఆ రేంజ్ స్కోప్ ఉన్న పాత్ర కేవలం మొదటి సినిమాలోనే దక్కడం ఆ పాత్రధారి జగదీశ్ అదృష్టం అనే చెప్పాలి. ఇప్పుడు పుష్ప కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘పుష్ప : ది రూల్’ చిత్రం లో కూడా జగదీశ్ నటిస్తున్నాడు. ఇందులో కూడా ఆయన పాత్ర హీరో స్క్రీన్ మీద కనిపించినంతసేపు కనిపిస్తాదట. వచ్చే ఏడాది ఆగస్టు 15 వ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతుంది.
అయితే జగదీశ్ తనకి పుష్ప సినిమాతో వచ్చిన బంగారం లాంటి భవిష్యత్తుని పోగొట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. అసలు విషయానికి వస్తే ఒక సీనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో కలిసి ఉన్న ప్రైవేట్ ఫోటోలను తన కెమెరా తో తీసి ఆమెని బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమం తలపెట్టాడు జగదీశ్. సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తాను అంటూ బెదిరింపులు చేసేవాడట. ఇతని వేధింపులు తట్టుకోలేకపోయిన ఆ సీనియర్ ఆర్టిస్ట్ తన స్వగృహం లో నవంబర్ 29 వ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఈమె ఆత్మ హత్య చేసుకున్న విషయాన్నీ తెలుసుకొని పరారీ లో ఉన్న (Jagadish) జగదీశ్ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి నేడు కోర్టులో హాజరుపర్చారు. ఈ సంఘటన తో జగదీశ్ కెరీర్ ఇక ముగిసినట్టే అనుకోవాలి. పుష్ప చిత్రం లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న జగదీశ్ కి సంబంధించి ఇంకా బోలెడంత సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. మరి ఆయన సన్నివేశాలను బైలు మీద తీసుకొచ్చి నిర్మాతలు చిత్రీకరిస్తారా?, లేదా ఆ పాత్ర ని మరో ఆర్టిస్టుతో రీ షూట్ చేసి కొనసాగిస్తారా అనేది చూడాలి.