వరుస విజయాలతో సూపర్ ఫామ్లో ఉన్న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ తో (Daaku Maharaaj) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పెద్దగా అంచనాలు లేకుండా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ వచ్చింది. దర్శకుడు బాబీ (K. S. Ravindra) స్క్రీన్ ప్లే కొత్త ఫీలింగ్ ఇచ్చింది. నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. పాజిటివ్ టాక్ రావడం వల్ల ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) వచ్చాక ‘డాకు కలెక్షన్స్’ తగ్గాయి.
Daaku Maharaaj Collections:
దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టంగా మారింది. ఒకసారి (Daaku Maharaaj) 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 9 రోజుల్లో ఈ సినిమా రూ.73.46 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.10.04 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వారం కూడా గట్టిగా రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.