యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ (Koratala Siva) కాంబో మూవీ దేవర (Devara) విడుదలై ఇప్పటికే రెండు వారాలైంది. సాధారణంగా ఎంత పెద్ద సినిమా అయినా థియేటర్లలో విడుదలైన రెండు వారాల తర్వాత ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దొరకడం జరగదు. అయితే ఈ విషయంలో దేవర మేకర్స్ ను మెచ్చుకోవాల్సిందేనని చెప్పవచ్చు. ఈ వారం ఏకంగా ఏడు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఇన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైనా దేవరకు మాత్రం థియేటర్ల విషయంలో ఎదురులేదని చెప్పవచ్చు.
Devara
ఇప్పటికీ మెయిన్ సెంటర్లలో దేవర మూవీ ప్రదర్శితం అవుతుండటం గమనార్హం. టైర్2, టైర్3 సిటీలలో సైతం దేవర మూవీకే థియేటర్ల విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ దక్కింది. దసరా కానుకగా విడుదలైన ఇతర సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమాలు ఆక్యుపెన్సీ విషయంలో నిరాశపరుస్తున్నాయి. దేవర సినిమా ఈ వారం సాధించే కలెక్షన్లతో 500 కోట్ల మార్క్ ను క్రాస్ చేసే ఛాన్స్ ఉంది.
వీక్ డేస్ లో బుకింగ్స్ ఎలా ఉన్నా వీకెండ్ లో బుకింగ్స్ విషయంలో దేవర కలెక్షన్ల విషయంలో అదరగొడుతుందని అభిమానులు ఫీలవుతున్నారు. దేవర ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండనున్నాయో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఅర్ ఫ్యాన్స్ దేవర సినిమా సక్సెస్ తో సంతోషిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ వల్లే ఈ సినిమా సక్సెస్ సాధించిందని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర (Devara) పాత్రలో తారక్ అదరగొట్టాడని ఆ పాత్ర కోసం తారక్ పడిన కష్టం అంతాఇంతా కాదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర2 సినిమా నిజంగా కొరటాల చెప్పిన మాటలకు అనుగుణంగా ఉంటే మాత్రం ఈ సినిమా కలెక్షన్ల పరంగా క్రియేట్ చేసే రికార్డులు మాత్రం మామూలుగా ఉండవు. దేవర2 2026లో థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.