ప్రస్తుతం కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా ఆసక్తి కలిగిస్తున్న ఒక ప్రాజెక్ట్ పై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. టాప్ హీరోలు ధనుష్ (Dhanush), సూర్య (Suriya) కలయికలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేయడానికి అడుగులు వేస్తున్నట్లు టాక్ వస్తోంది. సౌత్ ఇండస్ట్రీ నుంచి వరుసగా వస్తున్న భారీ సినిమాల జాబితాలో ఇది కూడా చేరనుందని సమాచారం. ధనుష్, కోలీవుడ్ లోనే కాకుండా ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లోనూ తన ప్రత్యేక గుర్తింపును సంపాదించిన నటుడు.
Dhanush, Suriya
తెలుగులో ‘సార్’ (Sir) సినిమాతో వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో చేసిన అనుభవం ధనుష్‌కు ఉంది. అయితే ఈ కాంబినేషన్‌లో మరోసారి కలిసి పనిచేయనున్నట్లు గత కొన్ని రోజులుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది మల్టీస్టారర్ కాంబినేషన్ అనే లీక్స్ కూడా వస్తున్నాయి. మరో హీరో సూర్య అనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. సూర్య అయితే ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల మీద దృష్టి పెట్టాడు.
‘కంగువ’తో (Kanguva) ఆశించిన ఫలితం రాకపోయినా, నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో హిట్ కొట్టి పాన్ ఇండియా మార్కెట్ లో బిజీ అవ్వాలని చూస్తున్నాడు. ఇక ధనుష్‌తో కలసి నటించడంపై కూడా ఆలోచిస్తున్నట్లు టాక్. ఈ చిత్రానికి ‘హానెస్ట్ రాజ్’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది విన్నూత్నమైన కథతో ఉంటుందని టాక్. వెంకీ అట్లూరి ఇప్పటికే ‘తొలి ప్రేమ,’ (Tholi Prema) ‘లక్కీ భాస్కర్ (Lucky Baskhar),’ ‘సార్’ వంటి సినిమాలతో తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
ఇప్పుడు మల్టీస్టారర్ కథను డిజైన్ చేస్తూ, రెండు భిన్న శైలుల్లో నటించే హీరోలతో అదిరిపోయే ప్రాజెక్ట్ రూపొందించాలని చూస్తున్నాడు. ఈ సినిమా ధనుష్, సూర్య అభిమానులకు ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించాలనే నెపథ్యంలో నిర్మాణ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి.