మన లైఫ్ లోని చిన్న విషయాలను మరింత స్వీట్ గా, సరదాగా చూపించే మహాతల్లి .. ఈ వారం “ప్రయాణం” అనే బుజ్జి చిత్రంతో మనముందుకు వచ్చేసింది. నగరంలో వేగంగా గమ్యానికి చేరుకోవాలంటే ఎందులో ప్రయాణిస్తే బెటరో షార్ట్ ఫిలిం ద్వారా చెప్పేసింది. ప్రయాణికుల అనుభవాలని జోడించి మలిచిన ఈ చిత్రం ఎలా ఉందంటే..
ఎంతో తేడా ..
మన అవసరాన్ని బట్టి ఆటో వాళ్ల మీటర్ ఛార్జ్ మారిపోతుంటుంది. ప్రయాణించిన దూరం కంటే.. ప్రయాణికుడు లోకలా? నాన్ లోకలా ? అనే విషయం పై కిరాయి ఆధారపడి ఉంటుంది. పైగా మనమే ఆటో దగ్గరికి వెళ్లాలి.. అదే క్యాబ్ అయితే పిలిచినా చోటుకి వస్తుంది.. ఎవరికైనా ఫిక్స్డ్ రేట్. ఈ విషయాన్ని మహాతల్లి తనదైన స్టయిల్ లో చెప్పింది. అంతేకాదు కొంతమంది ఆటో డ్రైవర్ల ఓవర్ యాక్షన్ ని తమాషాగా చూపించింది. ఇందులో డ్రైవర్ గా రవితేజ.. ప్రయాణికురాలిగా జాహ్నవి చక్కగా నటించారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు మనకి ఎప్పుడో ఎదురైనట్లుగా అనిపిస్తాయి. సహజమైన మాటలతో ఈ ప్రయాణం హ్యాపీగా సాగిపోతుంది.