కొన్ని సినిమాల మీద చాలా నమ్మకాలు ఉంటాయి. అందులోనూ ఆ సినిమా ఓ హిట్ కాంబినేషన్‌లో రిపీట్ అవుతున్నది అంటే ఇంకా ఎక్కువ అంచనాలు ఉంటాయి. అంతేకాదు అలాంటి సినిమాలు తేడా కొడితే.. బాధ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కోవకు చెందిన సినిమానే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (Amar Akbar Anthony) . (Ravi Teja) – శ్రీను వైట్ల (Srinu Vaitla) కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా దారుణమైన ఫలితం అందుకుంది. తాజాగా ఈ సినిమా ఫలితంపై దర్శకుడు శ్రీను వైట్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Sreenu Vaitla
సినిమా ఎందుకు అలా అయింది, ఫలితానికి కారణం ఎవరు అనే అంశాల గురించి మాట్లాడలేదు కానీ సినిమా ఫలితం వల్ల దర్శకనిర్మాతల పరిస్థితి ఏంటి అనే విషయం గురించి మాట్లాడారు. తొలుత సినిమా చేయడం గురించి మాట్లాడుతూ అప్పుడున్న సమయంలో ఓ కన్ఫ్యూజన్‌తో తీసుకున్న నిర్ణయం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాఅని చెప్పారు. ఆ తర్వాత ఆ సినిమా వల్ల నిర్మాతలకు లాభాలొచ్చాయని, కానీ సినిమా ఫలితం మాత్రం నా (Srinu Vaitla) మీద చాలా ఎక్కువగా పడింది అని అన్నారు.
అక్కడితోఆ ఆగకుండా నిర్మాతల్ని రక్షించడం మాత్రమే సినిమా కాదు అని ఓ కామెంట్ చేశారు. ఇలా ఎందుకు అన్నారో అని డౌట్ పడుతుండగానే.. ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని కథ విషయంలో రాజీ పడకుండా సినిమాలు చేయాలని ఆ సినిమాతో అర్థమైంది అని పూర్తి చేశారు. అంటే సినిమాకు నిర్మాత నష్టపోలేదు అని క్లారిటీ ఇచ్చారు. మరి సినిమాలకు గ్యాప్ విషయం గురించి మాట్లాడుతూ.. సినిమాల నుండి విరామం తీసుకున్నప్పటికీ సినిమాలతోనే ప్రయాణిస్తున్నా.
ఈ గ్యాప్‌లో సినిమాలు చూస్తూనే గడిపాను. పరిశ్రమలో వస్తున్న మార్పులు గమనించాను. అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని వాటికి అనుగుణంగా వినోదాన్ని అందించడం కోసం శ్రమించాను అని శ్రీను వైట్ల (Srinu Vaitla) చెప్పారు. మరి ఆయన తనలో తాను చేసుకున్న మార్పులు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఈ నెల 11న తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కొత్త సినిమా ‘విశ్వం’ (Viswam) అప్పుడే వస్తోంది.