సినిమాలు చూసి చెడిపోతారో లేదో కానీ కచ్చితంగా మెదడుకి పదును పెడుతూ క్రియేటివిటీని మాత్రం పెంచుకుంటారు.. దీనికి చాలా ఉదాహరణలున్నాయి.. ఇలాంటి క్రియేటివిటీని ఓ సినిమా థియేటర్ ఓనర్ చూపిస్తే ఎలా ఉంటుంది?.. అదిరిపోతుంది కదూ.. అది కూడా చిత్రంలోని సన్నివేశానికి తగ్గట్టు ఉండడంతో హాల్‌లో ప్రేక్షకాభిమానుల ఈలలు, గోలల హంగామా మామూలుగా లేదు.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ – ‘బాషా’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు సురేష్ కృష్ణ కలయికలో వచ్చిన మూవీ ‘బాబా’..
2002 ఆగస్టు 15న తమిళ్, తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.. 20 ఏళ్ల తర్వాత ఈ ఫిలింకి లేటెస్ట్ టెక్నాలజీని అమర్చారు. కొన్ని సన్నివేశాలు కట్ చేసి ఎడిట్ చేసి.. డిజిటల్, డీటీఎస్, కలర్ గ్రేడింగ్ వంటి వాటితో రీమాస్టర్డ్ వెర్షన్ రెడీ చేసి.. డిసెంబర్ 13న రజినీ కాంత్ పుట్టినరోజు సందర్భంగా.. డిసెంబర్ 10న తమిళనాడుతో పాటు పలు చోట్ల రీ రిలీజ్ చేశారు (తమిళ్ వెర్షన్).. 11నుండి 21 వరకు రజినీకి ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్న మలేషియాలోనూ స్పెషల్ షోలు వేస్తున్నారు..
ఫ్లాప్ అయినా కానీ ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు.. ‘బాబా’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ యజమాని తన సృజనాత్మకతను చూపించాడు.. సినిమాలో మనీషా కోయిరాలా తన చెల్లితో కలిసి ‘బాబీ’ (హిందీ) సినిమాకి వెళ్తుంది.. టికెట్స్ లేకపోవడంతో రజినీ థియేటర్ ఓనర్‌ని అడగడం.. అతను సపరేట్ సోఫా వేయించడం జరుగుతుంది. అప్పుడు రజినీ ఫ్రెండ్ అరుణా చలం (గౌండమణి) ‘‘బాబా వస్తున్నారు.. లైట్లన్నీ వెయ్యండ్రా..
(రజినీ డైలాగ్ తర్వాత).. లైట్లన్నీ తీసెయ్యండ్రా’’ అంటాడు.. దీనికి తగ్గట్టుగానే థియేటర్లో లైట్స్ ఆన్, ఆఫ్ చేశారు.. దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘థియేటర్ ఓనర్‌కి మంచి టైమింగ్ ఉంది’ అంటూ బాగా వైరల్ చేస్తున్నారు మూవీ లవర్స్.. కాగా ‘బాబా’ తమిళ్ వెర్షన్ మొదటి వారం రూ. 93 లక్షలు వసూలు చేసి, రెండో వారంలోకి ఎంటర్ అయింది.. రీ రిలీజ్‌లోనూ సెకండ్ వీక్ రన్ అవడం విశేషం.. ఆ క్రెడిట్ రజినీకే దక్కింది..