సెంటిమెంట్ పక్కన పెట్టి ప్లాప్ హీరోయిన్ ని పవన్ కి సెట్ చేసిన క్రిష్
- February 26, 2020 / 04:34 PM ISTByFilmy Focus
పవన్ ప్రకటించిన మూడు సినిమాలతో ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి ఉన్న చిత్రం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ. గతంలో ఎన్నడూ పవన్ పీరియాడిక్ సినిమాలు చేయలేదు. అలాగే మొఘలుల కాలం నాటి పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్ర చేస్తున్నారు. రాబిన్ హుడ్ తరహాలో పెద్దలను కొట్టి పేదలకు పంచు అనే రీతిలో పవన్ పాత్ర ఉంటుందని సమాచారం. ఇక పవన్ ని గతంలో కేవలం యూత్ ఫుల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ లో మాత్రమే చూసిన అభిమానులకు పవన్ ని అలా వింటేజ్ లుక్ లో చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో పవన్ కి హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేశారట. పాత్ర రీత్యా కీర్తి సురేష్ బాగా సెట్ అవుతుందని ఆమెను ఎంపిక చేశారని సమాచారం. ఐతే గతంలో కీర్తి సురేష్ అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కి హీరోయిన్ గా చేసింది. పవన్ కెరీర్ లో అది ఎంత పెద్ద ఫ్లాపో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెంటిమెంట్ ని 100 శాతం ఫాలో అయ్యే చిత్ర పరిశ్రమలో క్రిష్ దానిని పక్కన పెట్టినట్టున్నాడు. అందుకే గత చిత్ర ఫలితం పరిగణలోకి తీసుకోకుండా ఆమెను ఎంపిక చేశారు. మరి క్రిష్ ఎంపికకు పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Most Recommended Video
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!
















