మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్'(Game Changer) అనే సినిమా రూపొందింది. దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాకి నిర్మాత. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. మొదటి నుండి ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ తో అవి మరింతగా రెట్టింపు అయ్యాయి అనే చెప్పాలి. ‘గేమ్ ఛేంజర్’ అనేది నిర్మాత దిల్ రాజు కెరీర్లో 50 వ సినిమాగా రూపొందింది. అందుకే ఎన్ని ఆటంకాలు ఎదురైనా, బడ్జెట్ లెక్కలు పెరిగిపోయినా..
Game Changer
ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు దిల్ రాజు. అలాగే గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తో చరణ్ ఖాతాలో ఓ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పడింది. అందువల్ల అతనికి ‘గేమ్ ఛేంజర్’ ను మార్కెట్ చేసుకోవడానికి ఈజీ అయ్యింది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాడు దిల్ రాజు. థియేట్రికల్ బిజినెస్ రూ.260 కోట్ల వరకు జరిగినట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది.
సో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.450 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. టార్గెట్ అయితే కష్టమైంది ఏమీ కాదు. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. రాంచరణ్ స్టార్ డం, సంక్రాంతి సెలవులు వంటివి కలిసొచ్చి బాక్సాఫీస్ వద్ద ‘గేమ్ ఛేంజర్’ ఓపెనింగ్స్ తోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంటుంది. నార్త్, తమిళంలో కూడా ఈ సినిమా భారీగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.