టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలీవుడ్‌లో చేస్తున్న తొలి సినిమా జాట్. సన్నీ డియోల్ (Sunny Deol) ‘ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ కంటెంట్‌తో నార్త్ ఇండియన్ ప్రేక్షకులను మెప్పించడంలో పుష్ప (Pushpa), జవాన్ (Jawan) లాంటి సినిమాలు విజయం సాధించిన తరుణంలో, గోపీచంద్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. జాట్ ప్రమోషన్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. సన్నీ డియోల్ ఎనర్జీ, గోపీచంద్ మేకింగ్ స్టైల్‌తో ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది.
Gopichand Malineni
గోపీ మార్క్ మాస్ యాక్షన్ టచ్ బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించనుంది. టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ మార్కెట్‌లో తమ మార్క్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోపీచంద్ బాలీవుడ్‌లో పట్టు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గోపీచంద్ మలినేని గతంలో తెలుగులో ఎన్టీఆర్ (Jr NTR) , రవితేజ (Ravi Teja), బాలకృష్ణ (Nandamuri Balakrishna) లాంటి స్టార్స్‌తో హిట్లు అందుకున్నారు. కానీ టాలీవుడ్ ట్రెండ్ మారుతుండటంతో గోపీ సినిమాలకు ఇక్కడ హీరోలు అంతగా కనెక్ట్ కావడం లేదు.
కానీ అదే కథలు బాలీవుడ్‌లో కొత్తగానే అనిపిస్తుండటంతో జాట్ వంటి ప్రాజెక్ట్ ద్వారా తన టాలెంట్ చూపించేందుకు గోపీకి ఇది చక్కటి అవకాశం. ఉత్తరాది హీరోలకు గోపీ మార్క్ యాక్షన్ బాగా కనెక్ట్ అవుతుందని ఇన్‌సైడ్ టాక్. ఇక జాట్ ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సక్సెస్ అయితే గోపీచంద్ మలినేని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. బాలీవుడ్‌లో టైర్-2 హీరోలంతా ఆయనతో పనిచేయడానికి ముందుకు వస్తారని అంచనా.
అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా కొంతమంది బాలీవుడ్ హీరోలను లైన్ లో పెట్టె ప్రయత్నం చేస్తోంది. అందులో సల్మాన్ ఖాన్ (Salman Khan) , అక్షయ్ కుమార్ (Akshay Kumar), అజయ్ దేవ్ గన్ (Ajay Devgn) కూడా ఉన్నారు. ఒకవేళ జాట్ హిట్టయితే ఎవరో ఒకరితో సినిమా చేసే ఛాన్స్ రావచ్చు. టాలీవుడ్ మేకర్స్ బాలీవుడ్ మేకర్స్ కంటే మెరుగ్గా కమర్షియల్ సినిమాలు డెలివర్ చేస్తున్నారని బాలీవుడ్ ప్రముఖులు కూడా చెబుతున్నారు. గోపీ పట్ల కూడా అదే నమ్మకం బాలీవుడ్‌లో ఉంది. మరి గోపిచంద్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.