టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఇప్పుడు మరోసారి రీమేక్ ట్రాక్ ఎక్కుతున్నారు. తెలుగులో ఈ సంక్రాంతికి వేంకటేశ్ (Venkatesh Daggubati) , అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) హిట్ అవడంతో, ఆ సక్సెస్ ను బాలీవుడ్ లో కూడా రిపీట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఈ సారి కూడా ఇది రిస్కీ గేమ్ అయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దిల్ రాజు ఇప్పటికే బాలీవుడ్ లో అడుగు పెట్టారు.
నాని (Nani) జెర్సీ (Jersey) సినిమాను హిందీలో షాహిద్ కపూర్ తో (Shahid Kapoor) రీమేక్ చేశారు. అలాగే హిట్ సినిమాను కూడా రీమేక్ చేశారు. అయితే ఆ సినిమాలు మంచి రివ్యూలు తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద కచ్చితమైన సక్సెస్ అందుకోలేకపోయయి. ఇప్పుడు అదే దారి లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మూల కథ హిందీ ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందని ధీమాగా ఉన్నప్పటికీ, ఈసారి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా ఉండకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
ఎందుకంటే అనిల్ రావిపూడి తన స్టైల్ లో సినిమాను డిజైన్ చేసి, ప్రమోషన్ కూడా చక్కగా నిర్వహించడం విజయానికి కీలకంగా మారింది. కానీ ఆయన ఇప్పుడు చిరంజీవితో (Chiranjeevi) సినిమా చేయడానికి బిజీగా ఉండటంతో, హిందీ రీమేక్‌కు కొత్త దర్శకుడు ఫైనల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దిల్ రాజు ఈ ప్రాజెక్టు కోసం ఇద్దరు హిందీ దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. డైరెక్టర్ కుదిరిన వెంటనే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను (Akshay Kumar) హీరోగా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
దిల్ రాజు ఇప్పటికే అక్షయ్ కు అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. కానీ అక్షయ్ గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అక్షయ్ కామెడీ టైమింగ్ కి సరిపోతుందనే ధీమాతో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ పై ముందుకెళ్తున్నారు. కానీ, సరిగా ఎగ్జిక్యూట్ చేయకపోతే, ఇది కూడా జెర్సీ లానే ఫ్లాప్ అవుతుందనే భయం ఉంది. మొత్తానికి ఈ రీమేక్ గేమ్ లో దిల్ రాజు విజయం సాధిస్తారా? లేక మళ్లీ రిస్క్ లో పడతారా? అనేది వేచి చూడాలి.