Jr NTR: నువ్వు రన్ టైమ్ గురించి అడగడం ఏంటయ్యా
- September 14, 2024 / 11:54 AM ISTByFilmy Focus
మొన్నామధ్య “దేవర” (Devara) ట్రైలర్ లాంచ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) & సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఒకే ఫొటోలో కనిపించగానే ఇంటర్నెట్ షేక్ అయిపోయిన విషయం తెలిసిందే. ఆ కాంబినేషన్ లో ఒక్క సినిమా వస్తే బాగుండు అని ఎన్టీఆర్ అభిమానులే కాక ప్రతి తెలుగు సినిమా అభిమాని గట్టిగా కోరుకున్నారు. అయితే.. ఈ ఇద్దరు కలిసింది ప్రస్తుతానికి “దేవర” ప్రమోషన్స్ కోసమని ఇవాళ క్లారిటీ వచ్చింది. దేవర క్యాస్ట్ అయిన ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) & జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తోపాటుగా దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కూడా ఒకే వేదికపై చేరి “దేవర” సినిమా ప్రమోషన్స్ కోసం సందీప్ రెడ్డి వంగా హోస్ట్ గా ఒక వీడియో ఇంటర్వ్యూ రికార్డ్ చేసారు.
Jr NTR

సదరు ఇంటర్వ్యూ ప్రోమోను ఇవాళ విడుదల చేశారు. అందులో సందీప్ రెడ్డి “దేవర రన్ టైమ్ ఎంత?” అని కొరటాలను అడగగా.. వెంటనే ఎన్టీఆర్ కలగజేసుకొని “రన్ టైమ్ గురించి అడుగుతున్నావా?” అని నవ్వుతూనే “యానిమల్ (Animal) రన్ టైమ్ ఎంత?” అని తిరిగి కౌంటర్ వేశాడు ఎన్టీఆర్. ఈ ఫన్నీ టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతోపాటుగా ఎన్టీఆర్ మరో ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా చేశాడు, అది ఆలియా భట్ తో సోలో ఇంటర్వ్యూ.

ఎన్టీఆర్ & అలియా తమ సినిమాలైన “దేవర & జిగర్”లను జంటగా ప్రమోట్ చేసుకున్నారు ఈ ఇంటర్వ్యూలో. “ఆర్ఆర్ఆర్” (RRR) కాంబినేషన్ కావడంతో సదరు ఇంటర్వ్యూ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇకపోతే.. “దేవర” రిలీజ్ కి మరి 13 రోజులు ఉండగా, అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ వరకు గట్టిగా జరుగుతున్నాయి.

మరి తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఎప్పడు ఓపెన్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 22నా హైద్రాబాద్ లో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఓ బడా హీరోను ముఖ్య అతిథిగా తీసుకువచ్చేందుకు కొరటాల విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
Words as wild as the storm….
Here’s the promo! #Devara #DevaraOnSep27th pic.twitter.com/YHPNyCokDq— Devara (@DevaraMovie) September 14, 2024
















